Airtel | ప్రముఖ టెలికం సంస్థ ‘భారతీ ఎయిర్టెల్’ తన యూజర్లకు కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ కింద నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు అన్ లిమిటెడ్ 5జీ డేటా అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఓటీటీ బెనిఫిట్లతోపాటు ఫాస్ట్ స్పీడ్ ఇంటర్నెట్ కోసం ఎదురుచూసే వారికి ఈ ప్లాన్ ఉపకరిస్తుందని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. ఈ ప్లాన్ కింద రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. వెబ్సైట్, మొబైల్ యాప్‌లోనూ ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.
రూ.1,499 ప్రీపెయిడ్ రీచార్జి ప్లాన్ కింద ప్రతి రోజూ 3జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్లు పొందొచ్చు. ఈ ప్లాన్ 84 రోజులు అమల్లో ఉంటుంది. వీటితోపాటు నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్ మెంబర్ షిప్, ఫ్రీ హెల్లో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ లభిస్తాయి. భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ కేవలం రూ.199లకే లభిస్తుంది.
యూజర్లు కాంప్లిమెంటరీ నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ‘భారతీ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్’ ద్వారా క్లయిమ్ చేయాల్సి ఉంటుంది. అన్ లిమిటెడ్ 5జీ డేటా బెనిఫిట్లు కూడా అలాగే క్లయిమ్ చేయాల్సి ఉంటది.