Airtel-Axis Bank Credit Card | ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త. రెండు సంస్థలు కలిసి సరికొత్త క్రెడిట్ కార్డును ఆవిష్కరించాయి. ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు పేరుతో విపణిలోకి విడుదల చేశాయి. ఈ క్రెడిట్ కార్డుపై పలు రకాల ఆకర్షణీయ బెనిఫిట్లు ఆఫర్ చేశాయి. ఎయిర్టెల్ కస్టమర్లు ఎయిర్టెల్ మొబైల్ యాప్ ద్వారా క్యాష్ బ్యాక్, స్పెషల్ డిస్కౌంట్లు, డిజిటల్ ఓచర్లు, కాంప్లిమెంటరీ సర్వీసులు పొందొచ్చు.
భారతీ ఎయిర్టెల్ భారత్, దక్షిణాసియా సీఈవో కం ఎండీ గోపాల్ విఠల్ మాట్లాడుతూ తమ కస్టమర్లకు వరల్డ్ క్లాస్ డిజిటల్ సర్వీసులు ఆఫర్ చేసేందుకు పటిష్టమైన ఫైనాన్సియల్ సర్వీసెస్ పోర్ట్ఫోలియో నిర్మిస్తామన్నారు. టెల్కో-బ్యాంక్ భాగస్వామ్యంతో ఎయిర్టెల్ కస్టమర్లు యాక్సిస్ బ్యాంక్ వరల్డ్ క్లాస్ ఫైనాన్సియల్ సేవలు పొందొచ్చునని తెలిపారు. యాక్సిస్ బ్యాంక్ ఎండీ కం సీఈవో అమితాబ్ చౌదరి మాట్లాడుతూ ఎయిర్టెల్ 340 మిలియన్ల మంది కస్టమర్లకు యాక్సిస్ బ్యాంక్ డిజిటల్ ఫైనాన్సియల్ ఆఫర్లు అందుబాటులోకి తెస్తామన్నారు.