Air India | టికెట్ల బుకింగ్స్లో ఇక ఫ్లెక్సిబిలిటీ.. అందుకు ఎయిర్ ఇండియా ఏం చేసిందంటే..?!
Air India | టాటా సన్స్ అనుబంధ ఎయిర్ ఇండియా తన ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త ఫెసిలిటీ తీసుకొచ్చింది. తమ విమానాల్లో ప్రయాణించే వారు తమకు వీలైనప్పుడు టికెట్ బుక్ చేసుకునేందుకు వీలుగా రెండు రోజుల పాటు టికెట్ల ధరలు లాక్ చేసుకునే సౌకర్యం కల్పించింది.
Air India | టాటా సన్స్ అనుబంధ ఎయిర్ ఇండియా తన ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త ఫెసిలిటీ తీసుకొచ్చింది. తమ విమానాల్లో ప్రయాణించే వారు తమకు వీలైనప్పుడు టికెట్ బుక్ చేసుకునేందుకు వీలుగా రెండు రోజుల పాటు టికెట్ల ధరలు లాక్ చేసుకునే సౌకర్యం కల్పించింది. అయితే, ప్రయాణికులు ఇందుకోసం కొంత మొత్తం చెల్లించాలి. ఇలా టికెట్ ధర లాక్ చేయడం వల్ల ప్రయాణికులు టికెట్ ధర మారకుండా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.
మామూలుగా విమాన టికెట్ ధరలు నిత్యం మారుతుంటాయి. ప్రయాణ సమయం తక్కువైనప్పుడు తీవ్ర ఒడుదొడుకులకు గురి కావడంతోపాటు గిరాకీ ఎక్కువగా ఉంటే భారీగా పెరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక విమాన టికెట్ ధర పెరగకుండా టికెట్ ‘ఫేర్ లాక్’ సౌకర్యం తెచ్చినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. అయితే ప్రయాణానికి కనీసం 10 రోజుల ముందు ఈ సౌకర్యం వాడుకోవచ్చుననని వివరించింది.
విమాన ప్రయాణికులు.. ఎయిర్ ఇండియా తీసుకొచ్చిన ‘ఫేర్ లాక్’ ఫెసిలిటీ వాడుకునేందుకు ముందు కొంత నాన్ రీఫండబుల్ ఫీజు పే చేసి ఎయిర్ ఇండియా వెబ్ సైట్ లో గానీ, మొబైల్ యాప్ లో గానీ మేనేజ్ బుకింగ్స్ ఆప్షన్లతో మిగతా ప్రక్రియ పూర్తి చేయవచ్చు. దేశీయ విమాన సర్వీసుల్లో ప్రయాణించే వారు రూ.500, తక్కువ దూరం విదేశీ ప్రయాణానికి రూ.850, సుదూర అంతర్జాతీయ ప్రయాణానికి రూ.1500 నాన్ రీఫండ్ ఫీజు చెల్లించి టికెట్ ధర లాక్ చేసుకోవచ్చు. ఏ కారణంతోనైనా టికెట్ బుక్ చేసుకోకుంటే మాత్రం ఆ మొత్తం మనీ తిరిగి రాదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

