AI | ఏఐ రాకతో 2030 నాటికి ఈ కొలువులు కనుమరుగు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో రాబోయే రోజుల్లో కొలువుల ఊచకోత తప్పదనే ఆందోళన నెలకొంది. ఓపెన్ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ విశేష ఆదరణ పొందడంతో ఇంటరాక్టివ్ ఏఐ టూల్స్ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.
న్యూయార్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో రాబోయే రోజుల్లో కొలువుల ఊచకోత తప్పదనే ఆందోళన నెలకొంది. ఓపెన్ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ విశేష ఆదరణ పొందడంతో ఇంటరాక్టివ్ ఏఐ టూల్స్ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే చాట్‌జీపీటీతో పలు ఉద్యోగాలు కనుమరుగవుతుండగా 2030 నాటికి ఏఐతో లక్షలాది ఉద్యోగాలు రీప్లేస్ అవుతాయని లేటెస్ట్ సర్వే బాంబు పేల్చింది.
ఏఐ టెక్నాలజీతో పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కనుమరుగవుతాయని, ఆయా కొలువులకు హైరిస్క్ తప్పదని మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ తాజా అధ్యయనం వెల్లడించింది. అమెరికాలో జాబ్ మార్కెట్‌పై ఏఐ పెను ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు ఏఐ రాకతో కొత్త ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతుందని అంచనా వేసింది.
ఆర్ధిక ఆటోమేషన్‌కు ఏఐ దారితీస్తుందని 2030 నాటికి అమెరికా ఆర్ధిక వ్యవస్ధలో ఏఐ బలీయమైన శక్తిగా అవతరిస్తుందని పేర్కొంది. ఆటోమేషన్, డేటా కలెక్షన్ వంటి ఉద్యోగాలను ఏఐ సమర్ధంగా రీప్లేస్ చేస్తుందని పేర్కొంది. ఆఫీస్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్, ఫుడ్ సర్వీస్ ఎంప్లాయ్మెంట్ వంటి పలు రంగాల్లో ఉద్యోగాలు ఏఐతో ప్రభావితమవుతాయని తెలిపింది.
1,60,000 క్లరికల్ ఉద్యోగాలు, 8,30,000 రిటైల్ సేల్స్‌పర్సన్ ఉద్యోగాలు, ఏడు లక్షలకుపైగా అడ్మిన్ జాబ్స్, ఆరు లక్షలకు పైగా క్యాషియర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయని మెకిన్సే అధ్యయనం వెల్లడించింది. 1.8 లక్షల మంది ఉద్యోగులు 2030 నాటికి వేరే జాబ్‌లను వెతుక్కుంటూ విభిన్న రంగాలకు తరలివెళ్లాల్సిన పరిస్ధితి తలెత్తుతుందని అంచనా వేసింది.
Read More :
LPG Cylinder price | స్వల్పంగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర..
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- AI
- ChatGPT
- human jobs
- replace
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

