Tax Saving-Home Loan | తక్కువ వడ్డీ బెనిఫిట్లు.. హోంలోన్‌తో ఇలా ఆదా!
Tax Saving-Home loan | ఆదాయం పన్ను ఆదాకు సొంతింటి కొనుగోలు బెస్ట్ ఆప్షన్. గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు డిడక్షన్ క్లయిం చేయొచ్చు.

Tax Saving-Home Loan | ఆదాయం పన్ను నుంచి మినహాయింపులు పొందడానికి అన్ని అవకాశాలు పూర్తయ్యా.. అలాగని ఇబ్బంది పడొద్దు.. ఐటీ రిటర్న్స్ నుంచి మినహాయింపుకు హోంలోన్ ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. పన్ను మినహాయింపుతోపాటు తక్కువ వడ్డీరేట్లకే గణనీయ ఆస్తిగా ఓ ఇల్లు సొంతం చేసుకోవచ్చు. తక్కువ వడ్డీరేట్లకే హోంలోన్లు.. వాటితో పన్ను ఆదా మార్గాల గురించి చాలా మందికి తెలుసు.. కానీ చాలా కొద్ది మందికి మాత్రమే తమ ఇంటి రుణం ఎంత.. దాని టెన్యూర్ ఎంత అన్న విషయం తెలుసు. శరవేగంగా రీపేమెంట్స్ ద్వారా ఖర్చు తగ్గించుకోవడం బెస్ట్ ఎక్స్పీరియెనిస్తుంది. మీరు తెలివిగా ఈ అవకాశాలను వాడుకుంటే సేవింగ్స్‌లో బెస్ట్‌గా నిలుస్తారు.
80సీ సెక్షన్‌తోపాటు పలు ఆప్షన్లు
ఆదాయం పన్ను చట్టం (ఐటీ)లోని 80సీ సెక్షన్ కింద ప్రతియేటా రూ.1.5 లక్షల వరకు ఇండ్ల రుణ వాయిదా చెల్లింపుపై పన్ను ఆదా చేయొచ్చు. అయినప్పటికీ పలు ఆప్షన్లు ఉన్నాయి. ఈపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ఈఎల్ఎస్ఎస్), యులిప్స్‌లో ఇన్వెస్ట్మెంట్, స్కూల్ ఫీజు, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులపైనా పన్ను ఆదా చేయొచ్చు.
ఐటీ 24బీ సెక్షన్ కింద ఇలా
ఆదాయం పన్ను చట్టం (ఐటీ యాక్ట్)లోని 24బీ సెక్షన్ ప్రకారం హోంలోన్‌పై వడ్డీకి మినహాయింపు వర్తించదు. మీరు వార్షిక ప్రాతిపదికన చెల్లించే వడ్డీపైనే ఈ మినహాయింపు పొందొచ్చు. మీరు ఏటా 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుందనుకోండి.. అప్పుడు మీరు ప్రతియేటా రూ.60వేలు ఆదా చేయొచ్చు. వార్షిక ప్రాతిపదికన రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఒకవేళ వడ్డీరేట్లు తక్కువగా ఉంటే పన్ను ఆదా కూడా తక్కువే. ఐటీ చట్టంలోని 24 బీ సెక్షన్ కింద ఏటా రూ.2 లక్షల వడ్డీ చెల్లింపుపైనా డిడక్షన్ క్లయిమ్ చేయొచ్చు. ఒకవేళ అద్దెకు ఉంటే చెల్లించే మొత్తంలో గరిష్ట వడ్డీరేటుపై మినహాయింపులు ఉండవు.
పన్ను ఆదా కోసం ఇలా అధిక రుణం
మీరు ఒకవేళ పన్ను ఆదా కోసం చూస్తున్నట్లయితే, గరిష్ఠంగా పన్ను ఆదా చేయడానికి ఎక్కువ టెన్యూర్ లోన్‌తో అధిక రుణం తీసుకోవచ్చు. ఉదాహరణకు మీరు 30శాతం పన్ను చెల్లింపు క్యాటగిరీలోకి వస్తున్నారనుకుందాం.. మీరు 15 ఏండ్లకు ఏడు శాతం వడ్డీపై రూ.30 లక్షల రుణం తీసుకున్నారనుకోండి. 15 ఏండ్లలో వడ్డీపై పన్ను ఆదా రూ.5.54 లక్షలు ఉంటుంది. అలా కాకుండా 30 ఏండ్ల టెన్యూర్ కింద రూ.50 లక్షల రుణం తీసుకుంటే రూ.13.93 లక్షలు పన్ను రూపేణా పొదుపు చేయొచ్చు.
దీర్ఘ కాలిక రుణంతోపాటు వడ్డీ కూడా ఎక్కువే
దీర్ఘకాలిక రుణం తీసుకుంటే మొత్తం చెల్లించే వడ్డీ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. రూ.30 లక్షల హోంలోన్‌పై రూ.18.53 లక్షల పన్ను చెల్లించాలి. అలా కాక రూ.50 లక్షల రుణంపై మొత్తం రూ.52.59 లక్షల రుణం చెల్లించాలి. అంటే వడ్డీ రూపేణా చెల్లిస్తున్న మొత్తం పన్ను ఆదా చేసిందానికంటే ఎక్కువే.
అధిక రుణాలతో ప్రిన్సిపల్ అమౌంట్ ఇలా
అధిక ఇండ్ల రుణాలు తీసుకుంటే ఎక్కువ పన్ను ఆదా చేయొచ్చనే వాదన పుక్కిటి పురాణం. నెలవారీగా చెల్లించాల్సిన వడ్డీ వాయిదా తగ్గుతుంది.. కానీ ప్రిన్సిపల్ అమౌంట్ రీపేమెంట్ నిరంతరం పెరుగుతూ ఉంటుంది. వార్షిక వడ్డీ చెల్లింపు ప్రారంభంలో ఎక్కువగా ఉండి తగ్గుతూ వస్తుంది. అయితే, ఐటీ యాక్ట్ 24 బీ సెక్షన్ కింద గరిష్ఠంగా రూ.2 లక్షల వడ్డీ చెల్లింపుపై పన్ను ఆదా చేయొచ్చు.
రూ.2 లక్షలకు పైగా పన్ను చెల్లిస్తే ఇదీ పరిస్థితి
ఒకవే మీరు రూ.2 లక్షల కంటే ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నట్లయితే.. ఆ మొత్తానికి పన్ను మినహాయింపు వర్తించదు. అధిక మొత్తంలో ఇంటి రుణం తీసుకుంటే పన్ను ఆదా కాకపోగా, రెట్టింపు ప్రతికూల ఫలితాలు మిగులుతాయి. ఎక్కువ మొత్తంలో ప్రీపేమెంట్ చేస్తే ఔట్ స్టాండింగ్ లోన్ తగ్గుతుంది.. తదనుగుణంగా మీ అంచనా పరిధిలోకి వార్షిక వడ్డీరేటు వస్తుంది. ఇది మీరు వడ్డీ చెల్లింపులపై పన్ను ఆదా చేయడానికి వీలవుతుంది.
దంపతులు అధిక లోన్ తీసుకుంటే పన్ను ఆదా ఈజీ
ఒకవేళ భార్యాభర్తలు అధిక ఐటీ చెల్లిస్తున్నారా.. అయితే.. అధిక మొత్తానికి ఇంటి రుణం తీసుకోవచ్చు. హోంలోన్‌లో ప్రిన్సిపల్ అమౌంట్, వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద భార్యాభర్యలకు రూ.1.5 లక్షల చొప్పున రూ.3 లక్షలు, 24 బీ సెక్షన్ కింద రూ.2 లక్షల చొప్పున రూ.4 లక్షలు ఆదా చేయొచ్చు. రూ.60 లక్షల రుణంతీసుకోవడంతోపాటు 15 ఏండ్ల టెన్యూర్ పెట్టుకుంటే అధికంగా వడ్డీపై పన్ను పొదుపు చేయడంతోపాటు శరవేగంగా రుణం చెల్లింపులు పూర్తి చేయొచ్చు. అయితే, ఆస్తికి భార్యాభర్తలిద్దరూ ఉమ్మడి యజమానులుగా ఉండాలి.
తక్కువ ధరకే ఇల్లు కొంటే 80ఈఈఏ కింద ఇలా..
మీరు తక్కువ ధరకే ఇల్లు కొనుగోలు చేశారనుకోండి. ఆదాయం పన్ను చట్టం (ఐటీ యాక్ట్)లోని 80ఈఈఏ సెక్షన్ కింద అదనంగా రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. అయితే ఈ అదనపు డిడక్షన్ గడువు వచ్చే మార్చి నెలాఖరు వరకు పొడిగించారు. తద్వారా మీరు గరిష్టంగా రూ.5 లక్షల వరకు పన్ను ఆదా చేయొచ్చు. మీరు సమర్పించే పత్రాలు సంతృప్తికరంగా ఉంటే 80సీ సెక్షన్ కింద రూ.1.5 లక్షలు, 24 బీ సెక్షన్ కింద రూ.2 లక్షలు, 80ఈఈఏ సెక్షన్ కింద రూ.1.5 లక్షల వడ్డీ చెల్లింపుపై పన్ను ఆదా చేయొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- home loans
- tax savings
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

