అబుదాబీలో బిజినెస్ ఈజీ.. 90% టాక్స్‌లు మాఫీ!
అబుదాబీలో బిజినెస్ ఈజీ.. 90% టాక్స్‌లు మాఫీ!| వ్యాపారాల నిర్వహణకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు తదితరాలను అబుదాబీ సర్కార్ 90 శాతానికి పైగా ....

అబుదాబి: మీరు అబుదాబీలో కొత్తగా బిజినెస్ ప్రారంభించబోతున్నారా.. అయితే.. వ్యాపారాల నిర్వహణకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు తదితరాలను అబుదాబీ సర్కార్ 90 శాతానికి పైగా తగ్గించివేసింది. ఇప్పటికే వాణిజ్య దిగ్గజ కేంద్రంగా పేరు తెచ్చుకున్నది అబుదాబి..
ప్రాంతీయంగా.. అంతర్జాతీయంగా పోటీ పడేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే వ్యాపారాల నిర్వహణ ఫీజులు, టాక్స్‌లు దాదాపు పూర్తిగా తగ్గించివేసింది. ఈ టాక్స్‌ల తగ్గింపు మంగళవారం నుంచే అమల్లోకి రానున్నది.
ఏడు ఎమిరేట్ల కూటమిలో అబుదాబి ఒకటి. ఇటీవలి కాలంలో నూతన బిజినెస్‌లను ఆకర్షించేందుకు అబుదాబి అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను విభిన్న మార్గాల్లోకి తీసుకెళ్లేందుకు అబుదాబి కార్యాచరణ ప్రారంభించింది. అందులో భాగంగా యూఏఈలో కార్పొరేట్ టాక్స్ దాదాపు జీరోగా ఉంది.
అబుదాబిలో బిజినెస్ సెటప్ ఫీజు ఎంతో తెలుసా.. కేవలం 272 డాలర్లు (వెయ్యి ఏఈడీలు) మాత్రమే. ఇంతకుముందు నిర్ణయించిన ఫీజుతో పోలిస్తే 90 శాతానికి పైగా తక్కువ అని అదుబాబీ ప్రభుత్వ మీడియా కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇంతకుముందు వివిధ ప్రభుత్వ సంస్థలకు చెల్లించే ఫీజుల్లో కొన్నింటిని నూతన ఫీజు టారిఫ్‌లో రద్దు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఫీజుల తగ్గింపు మంగళవారం (జూలై 27) నుంచి అమలులోకి వస్తుంది.
ఎమిరేట్స్‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను గణనీయ స్థాయిలో విస్తరించడానికి, అంతర్జాతీయంగా.. ప్రాంతీయంగా అబుదాబి పోటీ పడే అవకాశాలు పెరుగుతాయని వివరించింది.
ఇప్పటికే 130కి పైగా దేశాలు అంతర్జాతీయ పన్ను విధానంలో సంస్కరణలు తేవడానికి అంగీకరించాయి. కార్పొరేట్ టాక్స్ కనీసం 15 శాతం ఉండాలని నిర్ణయించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

