హైదరాబాద్, అక్టోబర్ 9: ఫ్రెంచ్‌నకు చెందిన కన్జ్యూమర్ అప్లయెన్స్ బ్రాండ్ థాంప్సన్..క్రికెట్ వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. స్మార్ట్ టీవీ, వాషింగ్ మెషిన్, ఎయిర్ కండిషన్లను తక్కువ ధరకే అందిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 15 వరకు అమలులో ఉండనున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేలో ఈ మూడు రకాల ఉత్పత్తులను తక్కువ ధరకే విక్రయిస్తున్నది. వీటిలో 32 అంగుళాల స్మార్ట్ టీవీని రూ.6,299కే అందిస్తున్న సంస్థ..రూ.5,057కే వాషింగ్‌మిషన్ విక్రయిస్తున్నది. ప్రపంచ కప్ ప్రత్యేక ఎడిషన్‌గా 43 అల్ఫా005బీఎల్ని రూ.14,999కి అందిస్తున్నది.