అమ్ముడుపోని కార్ల విలువ 60,000 కోట్లు
ప్యాసింజర్ వాహన కొనుగోళ్లు మందగించడంతో.. డీలర్ల వద్ద అమ్ముడుపోని కార్ల నిల్వలు మునుపెన్నడూ లేనివిధంగా పేరుకుపోయాయి. ఆల్‌టైమ్ హైకి చేరిన ఈ ఇన్వెంటరీల విలువ రూ.60,000 కోట్లుగా ఉన్నట్టు ఆటో పరిశ్రమ చెప్తున్నది.
- డీలర్ల వద్ద ఆల్‌టైమ్ హైకి చేరిన వాహన నిల్వలు
న్యూఢిల్లీ, జూలై 10: ప్యాసింజర్ వాహన కొనుగోళ్లు మందగించడంతో.. డీలర్ల వద్ద అమ్ముడుపోని కార్ల నిల్వలు మునుపెన్నడూ లేనివిధంగా పేరుకుపోయాయి. ఆల్‌టైమ్ హైకి చేరిన ఈ ఇన్వెంటరీల విలువ రూ.60,000 కోట్లుగా ఉన్నట్టు ఆటో పరిశ్రమ చెప్తున్నది. వర్షాభావం, తగ్గిన రుణ లభ్యత, ఆర్థిక మందగమన పరిస్థితులు వాహన విక్రయాలను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నట్టు ఆటోమొబైల్ డీలర్ల సంఘం సమాఖ్య (ఫడా) ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) మొదలు కార్ల అమ్మకాలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయంటున్న ఫడా.. సుమారు 6 నుంచి 6.5 లక్షల కార్లు ఊరికే అలా ఉండిపోయాయని, ఒక్కో కారు విలువ సగటున రూ.9.5 లక్షలుగా లెక్కించినా వీటి విలువ దాదాపు రూ.60,000 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నది. గత రెండు నెలల్లో పెరిగిన స్టాక్ 77,000 యూనిట్లుగా ఉండటం గమనార్హం.
ఆఫర్లు.. డిస్కౌంట్లు
మార్కెట్లో అమ్మకాలు క్రమేణా క్షీణిస్తుండటాన్ని గమనించిన ఆటో రంగ సంస్థలు.. కస్టమర్లను ఆకట్టుకొనేందుకు రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లనూ తెరపైకి తెస్తున్నాయి. టాటా, మహీంద్రా, మారుతి ఇటీవల ప్రకటించిన ధరల తగ్గింపు, వివిధ మాడళ్లపై ప్రవేశపెట్టిన ప్రయోజనాలే ఇందుకు నిదర్శనం. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ నుంచే స్తబ్ధత నెలకొన్నది. దీంతో కొత్త మాడళ్లకు, ఎస్‌యూవీలకూ డిస్కౌంట్లనిస్తున్నాయి కంపెనీలు. అయినప్పటికీ జూన్‌లో సేల్స్ పడిపోయాయి. చేసిన సరఫరా ఆధారంగా కంపెనీల లెక్కలు గతంతో పోల్చితే 4 శాతం పెరిగి 3,41,000 యూనిట్లకు చేరాయని చెప్తున్నా.. జరిగిన వాహన రిజిస్ట్రేషన్లు 2,81,000 మాత్రమే. దీంతో ఆ మిగిలిన కార్లన్నీ డీలర్ల వద్దే ఉండిపోయాయి. మారుతీ సుజుకీ రిటైల్ సేల్స్ 8 శాతం పతనమయ్యాయి. దీంతో డిస్కౌంట్లు ఎక్కువగా ఇవ్వాలని, షోరూంలు త్వరగా తెరిచి.. ఆలస్యంగా మూసుకోవాలని డీలర్లకు మారుతీ సూచించడాన్నిబట్టి మార్కెట్ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిరుడు జూన్‌తో చూస్తే గత నెల ప్యాసింజర్ వాహన అమ్మకాలు 6.77 శాతం దిగజారాయని ఫడా చెప్తున్నది. ఇక మే నెలతో పోల్చితే 7.18 శాతం పడిపోయాయి. మారుతీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ సేల్స్ తగ్గిపోయినట్టు స్పష్టంగా కనిపించింది. కియా, స్కోడా, హోండా, ఎంజీ మోటర్, రెనాల్ట్ పరిస్థితీ ఇంతే. ఎక్స్‌యూవీ3ఎక్స్జీరోతో మహీంద్రాకు కొంత ఊపొచ్చింది. ఇక లగ్జరీ వాహన సంస్థల సంగతి చెప్పనక్కర్లేదు. పరిస్థితులు ఇలాగే ఉంటే కష్టమేనన్న ఆందోళన పరిశ్రమ నుంచి ఇప్పుడు వ్యక్తమవుతున్నది.
2 లక్షలు తగ్గిన ఎక్స్‌యూవీ700
మార్కెట్లో డిమాండ్‌ను పెంచే ఉద్దేశంతో మహీంద్రా తమ ఎక్స్‌యూవీ 700 ధరను రూ.2 లక్షల వరకు దించింది. దీంతో ఈ మాడల్ ధర రూ.19.49 లక్షలకు దిగొచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

