NR Narayana Murthy | ఇన్పీ బంపర్ డివిడెండ్ ఎఫెక్ట్.. నారాయణ మూర్తి మనుమడికి రూ.4.2 కోట్ల లాభం.. ఎలాగంటే..?!
NR Narayana Murthy | ఇన్ఫోసిస్ ప్రకటించిన డివిడెండ్ తో.. సంస్థ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ఐదు నెలల మనుమడు ఏకగ్రహ్ రోహన్ మూర్తి పంట పండింది.
NR Narayana Murthy | ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ఐదు నెలల మనుమడు ఏకగ్రహ్ రోహన్ మూర్తి పంట పండింది. ఇటీవలే తన మనుమడికి నారాయణ మూర్తి.. సంస్థలో 15 లక్షల షేర్లను కానుకగా ఇచ్చేశారు. ఇప్పుడు ఏకగ్రహ్ రోహన్ మూర్తికి ఆ 15 లక్షల షేర్లే రూ.4.20 కోట్లు సంపాదించి పెట్టాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించిన ఇన్పోసిస్ యాజమాన్యం.. ఒక్కో షేర్‌పై ఫైనల్ అండ్ స్పెషల్ డివిడెండ్ రూ.28 ప్రకటించింది. డివిడెండ్, స్పెషల్ డివిడెండ్‌కు ఆమోదం తెలిపేందుకు వచ్చేనెల 31న ఇన్ఫోసిస్ వార్షిక వాటాదారుల సమావేశం జరుగుతుంది. జూలై ఒకటో తేదీ నుంచి డివిడెండ్ చెల్లింపులు జరుగుతాయని ఇన్ఫీ తెలిపింది.
నారాయణమూర్తి కానుకగా ఇచ్చిన 15 లక్షల షేర్లపై రోహన్‌మూర్తికి రూ.240 కోట్ల ఆస్తి కలిగింది. ఇది దేశంలోని ఐటీ దిగ్గజాల్లో ఒక్కటిగా నిలిచిన ఇన్ఫీలో యువ మిలియనీర్ వాటాదారుడిగా మార్చేసింది. తాజాగా ఇన్ఫీ ప్రకటించిన ఫైనల్, స్పెషల్ డివిడెండ్ కలుపుకుంటే రోహన్ మూర్తికి రూ.4.2 కోట్ల లాభం వచ్చింది. నారాయణ మూర్తి కొడుకు రోహన్ మూర్తి- అపర్ణ కృష్ణన్ దంపతుల కొడుకే ఏకగ్రహ్ రోహన్ మూర్తి. నారాయణ మూర్తికి ఏకగ్రహ్ మూడో మనుమడు. అక్షతామూర్తి- బ్రిటన్ ప్రధాని రిషి సునక్ దంపతుల ఇద్దరు కూతుళ్లు నారాయణ మూర్తి ఇద్దరు మనుమలు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

