Personal Loan | తక్కువ వడ్డీపై పర్సనల్ లోన్ అర్హతలు.. ఇంకా ఏమేం కావాలంటే?!
Personal Loan | పర్సనల్ లోన్ మంజూరులో సిబిల్ స్కోర్, ఆదాయం, రుణ చెల్లింపుల హిస్టరీ, తదితర అంశాలు బ్యాంకులు కీలకంగా వ్యవహరిస్తాయి.
Personal Loan | ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో భారీ స్థాయిలో తక్షణం ఆర్థిక అవసరాలు ముందుకు వస్తుంటాయి. ఇటువంటి వంటి వారికి పర్సనల్ లోన్ ఒక ఆప్షన్‌గా ఉండేది. ఏ రుణమైనా సిబిల్ (క్రెడిట్) స్కోర్ ఆధారంగా బ్యాంకులు ప్రత్యేకించి ప్రైవేట్ బ్యాంకులు పర్సనల్ లోన్లు ఇచ్చేవి. క్రెడిట్ కార్డులు వాడుతున్న వారి చెల్లింపుల హిస్టరీ ఆధారంగా ఆయా క్రెడిట్ కార్డుల యాజమాన్యాలు కూడా తమ కస్టమర్లకు పర్సనల్ లోన్లు ఆఫర్ చేస్తుంటాయి. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు.. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు తమకు వచ్చే డిపాజిట్లతోనే అర్హులైన వారికి రుణాలు ఇస్తుంటాయి. గతంలో ప్రైవేట్ బ్యాంక్‌లు ఎక్కువగా పర్సనల్ (వ్యక్తిగత) లోన్లు ఇచ్చేవి. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఆ బాటలోనే ప్రయాణిస్తున్నాయి. సిబిల్ స్కోర్‌ను బట్టి వివిధ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు పర్సనల్ లోన్లపై వడ్డీ ఖరారు చేస్తాయి. ఆయా ఖాతాదారుల పేమెంట్స్ సామర్థ్యాన్ని బట్టి లోన్ టెన్యూర్ ఏడాది నుంచి ఐదేండ్ల వరకు నిర్ణయిస్తాయి. సిబిల్ స్కోర్ బట్టి ఆయా బ్యాంకులు వడ్డీరేట్లు వేర్వేరుగా ఉంటాయి. అసలు పర్సనల్ లోన్లు మంజూరు చేయడంలో కీలకమయ్యే అంశాలేమిటో ఓ లుక్కేద్దామా..!
సిబిల్ స్కోర్ ఇలా కీలకం
ఏ రుణం పొందాలన్నా సిబిల్ స్కోర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సిబిల్ స్కోర్‌ను బట్టి ఖాతాదారుల రుణ యోగ్యత ఖరారవుతుంది. బ్యాంకు వద్దకు రుణం కోసం వెళ్లిన దరఖాస్తు దారు సిబిల్ స్కోర్ తెలుసుకుంటాయి. ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే, విశ్వసనీయమైన వ్యక్తిగా భావిస్తాయి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు. అటువంటప్పుడు తక్కువ వడ్డీపై రుణం పొందొచ్చు. సిబిల్ స్కోర్ 300-900 మధ్య ఉంటుంది. 750 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటే వారు తక్కువ వడ్డీపైనే పర్సనల్ రుణం పొందగలుగుతారు. మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలంటే క్రెడిట్ కార్డు చెల్లింపులు, ఇతర రుణ బకాయిల పేమెంట్స్ సకాలంలో చేస్తూ ఉండాలి. సిబిల్ స్కోర్‌తోపాటు గతంలో రుణ చెల్లింపుల చరిత్రను కూడా పరిశీలిస్తాయి బ్యాంకులు. సాధారణంగా 12 నెలల్లో డీఫాల్ట్ కాని వ్యక్తులకు మాత్రమే పర్సనల్ లోన్ లభిస్తుంది. డీఫాల్టర్లకు రుణాలు లభించినా అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
ఆదాయాన్ని బట్టి తక్కువ వడ్డీ
ఆదాయం ఎక్కువగా ఉన్న వారు రుణ వాయిదాలు సక్రమంగా చెల్లిస్తారన్న నమ్మకం బ్యాంకులకు ఉంటుంది. ఆ నమ్మికతోనే బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలిస్తాయి. అయితే, రుణ గ్రహీత తమ ఐటీ రిటర్న్స్ పత్రాలను బ్యాంకులకు సమర్పించాలి. ఆదాయాన్ని బట్టి మీకు బ్యాంకులు రుణాలిస్తాయి. పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థలో పని చేస్తున్నట్లయితే కెరీర్ స్థిరంగా ఉంటుందని, ఆదాయం ఎక్కువ కాలం బాగుంటుందన్న నమ్మిక బ్యాంకులకు లభిస్తుంది. దీంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేయొచ్చు.
ఖాతా, లావాదేవీల నిర్వహణ కీలకమే
బ్యాంకులో పొదుపు ఖాతా నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగిస్తూ బ్యాంకు అధికారులు, సిబ్బందితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. తొలి నుంచి బ్యాంకు యాజమాన్యంతో మంచి సంబంధాలు ఉంటే ఆకర్షణీయ వడ్డీరేటుపైనే పర్సనల్ లోన్ పొందొచ్చు. ధరల పెరుగుదల, ఆర్థిక మాంద్యం, మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు, ఆర్బీఐ రెపోరేట్‌ను బట్టి కూడా వడ్డీరేట్లలో హెచ్చు తగ్గులు ఉంటాయి. రెపోరేట్ తగ్గితే రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయి. రెపోరేటు పెరిగితే రుణాలపై వడ్డీరేట్లు పెరుగుతాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
Sheetal Devi: ఆర్చరీలో శీతల్ దేవి అద్భుతం.. పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

