చెన్నై, జనవరి 24: ఫ్రెంచ్కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ సిట్రాయిన్…దేశీయ మార్కెట్లోకి నయా మాడల్‌ను పరిచయం చేసింది. న్యూ సిట్రాయిన్ ఈ-సీ3 షైన్ పేరుతో విడుదల చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ.13,18,800గా నిర్ణయించింది. సింగిల్ చార్జింగ్‌తో 320 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారు అత్యంత వేగంగా బ్యాటరీ రీచార్జి కానున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. రియర్ పార్కింగ్ కెమెరా, 15 ఇంచుల డైమండ్ కట్ అల్లోయస్, ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్, రియర్ వైపర్ అండ్ వాషర్, రియర్ డిఫోగర్ వంటి ఫీచర్స్‌తో ఈ నయా మాడల్‌ను తీర్చిదిద్దింది. వాహనం, బ్యాటరీ, ఏమోటర్పై వ్యారెంటీని పెంచుకునే అవకాశం కూడా కల్పించింది.
2024 సిట్రాయిన్-సీ3 మాడల్
ధరలు(ఢిల్లీ షోరూంలో)