హెచ్డీఎఫ్సీ లాభం రూ.3000 కోట్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 2: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ నికరలాభం స్టాండెలోన్ ప్రాతిపాదికన 2021 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో స్వల్ప తగ్గుదలతో రూ.3,001 కోట్లుగా నమోదయ్యింది. గతేడాది ఇదేకాలంలో సంస్థ నికరలాభం రూ.3,052 కోట్లు. అయితే 2020 జూన్ ఫలితాలతో తాజా నికరలాభాన్ని పోల్చతగదని, 2021 జూన్‌లో పెట్టుబడుల విక్రయంపై రూ.263 కోట్లు లాభంరాగా, గతేడాది ఈ లాభం రూ.1,241 కోట్లని కంపెనీ సోమవారం తెలిపింది. అలాగే డివిడెండు ఆదాయం కూడా రూ.263 కోట్ల నుంచి రూ.16 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. కాగా హెచ్డీఎఫ్సీ కన్సాలిడేటెడ్ నికరలాభం రూ.4,059 కోట్ల నుంచి రూ.5,311 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.4,147 కోట్లకు చేరింది. కంపెనీ స్థూల ఎన్పీఏలు 2.24 శాతం (రూ.11,120 కోట్లు)గా నమోదయ్యాయి. కొవిడ్ సెకండ్‌వేవ్‌తో ఏప్రిల్, మే నెలల్లో తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడిందని, జూన్ నెలలో సాధారణస్థాయికి చేరినట్లు హెచ్డీఎఫ్సీ సీఈవో కేకి మిస్త్రీ చెప్పారు. జూలై నెలలో తమ రుణ పంపిణీలు గణనీయంగా పెరిగినట్లు ఆయన వెల్లడించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- hdfc
- housing finance
- profits
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

