3.53 లక్షల కోట్లు మటాష్

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 883, నిఫ్టీ 258 పాయింట్లు క్షీణత
ముంబై, ఏప్రిల్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లను మళ్లీ కరోనా వైరస్ కుదిపేస్తున్నది. కొవిడ్-19 కేసులు పెద్ద ఎత్తున పెరుగుతుండటం, ఆయా రాష్ర్టాలు లాక్డౌన్లను ప్రకటిస్తుండటంతో మదుపరులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో సోమవారం ఒక్కరోజే మదుపరుల సంపద రూ.3 లక్షల 53,420.76 కోట్లు హరించుకుపోయింది. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నా.. బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ మాత్రం 882.61 పాయింట్లు లేదా 1.81 శాతం పడిపోయి 47,949.42 వద్దకు చేరింది. ఒకానొక దశలో 1,469 పాయింట్లకుపైగా పతనం కావడం గమనార్హం. పవర్‌గ్రిడ్ షేర్ విలువ అత్యధికంగా 4.17 శాతం దిగజారింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 258.40 పాయింట్లు లేదా 1.77 శాతం క్షీణించి 14,359.45 పాయింట్ల వద్ద నిలిచింది.
‘ఆక్సీజన్’ క్రేజ్
కరోనా విజృంభణ నేపథ్యంలో ఆక్సిజన్‌కు డిమాండ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ పరిస్థితి.. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఆ పేరున్న షేర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నది. బాంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ షేర్ విలువ సోమవారం ఏకంగా రూ.1,170.20 ఎగబాకి రూ.24,574.85ను తాకింది. అలాగే ‘గ్యాస్’ అన్న పదం ఏ సంస్థ పేరులో కనిపించినా.. మదుపరులు విశేషంగా ఆదరిస్తున్నారు. నిజానికి ఈ సంస్థలకు ఆక్స్సిజన్కు ఎలాంటి సంబంధం లేదు. పైగా బాంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ పేరు ప్రస్తుతం బాంబే ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్‌గా మారింది. అయినా మదుపరులు ఎగబడి కొనేస్తున్నారు. దీంతో అటు స్టాక్ మార్కెట్, ఇటు సెబీ వర్గాలు ఈ పరిణామాలను దగ్గరగా గమనిస్తున్నాయి.
బక్కచిక్కిన రూపాయి
మరోవైపు రూపాయి విలువ భారీగా పతనమైంది. అమెరికా డాలర్‌తో పోల్చి తే రూపాయి మారకం విలువ సోమవారం 53 పైసలు క్షీణించి 74.87కు పడిపోయింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bears
- bulls
- Stock Markets
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

