Mercedes-Benz G-Class G400d | భారత్ మార్కెట్లోకి మెర్సిడెజ్ జీ-క్లాస్ జీ400డీ .. ధరెంతో తెలుసా..?!
Mercedes-Benz G-Class G400d | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ భారత్ మార్కెట్లోకి జీ-క్లాస్ జీ400డీ కారు తీసుకొచ్చింది. డీజిల్ వేరియంట్‌గానే మార్కెట్లోకి వస్తున్న ఈ కారు ధర రూ.2.55 కోట్ల నుంచి మొదలవుతుంది.
Mercedes-Benz G-Class G400d | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ ఇండియా దేశీయ మార్కెట్లోకి న్యూ జీ-క్లాస్ మోడల్ కారు తెచ్చింది. దీని ధర రూ.2.55 కోట్లు పలుకుతుంది. న్యూ-క్లాస్ జీ400డీ వేరియంట్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇన్ లైన్ సిక్స్-సిలిండర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్ 330 బీహెచ్పీ విద్యుత్, 700 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. మెర్సిడెజ్-బెంజ్ బ్రాండ్ చరిత్రలో ఇది అత్యంత శక్తిమంతంగా డీజిల్ వాడుతున్న మోడల్‌గా నిలుస్తుంది. జీ400డీ మోడల్ కారు ఇండియా-స్పెసిఫిక్ అడ్వెంచర్ ఎడిషన్.. ఏఎంజీ లైన్లో ఆఫర్ చేస్తున్నది. అటుపై అడ్వెంచర్ టాగ్ జస్టిఫై చేయడానికి అదనపు ఫీచర్లు జత చేస్తారు.
మెర్సిడెజ్-బెంజ్ భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తున్న పది మోడల్ కార్లలో న్యూ జీ-క్లాస్ ఒకటి. ఇప్పటికే మెర్సిడెజ్ ఏఎంజీ ఈ53 కాబ్రోలెట్, ఏఎంజీ జీటీ 63 ఎస్ఈ పెర్ఫార్మెన్స్ ఆవిష్కరించింది.

స్పోర్టీ లుక్ తో వస్తున్న మెర్సిడెజ్ బెంజ్ జీ400డీ ఏఎంజీ లైన్ కారు.. మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, మల్టీ బీం ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, స్పోర్టీ స్టెయిన్ లెస్ స్టీల్ స్పేర్ వీల్ కవర్, అండర్ గార్డ్ ఇన్ సిల్వర్, 20-అంగుళాల స్టాండర్డ్ అల్లాయ్ వీల్స్, బర్మెస్టర్ సరౌండ్ సిస్టమ్, స్లైడింగ్ సన్ రూఫ్, అంబియెంట్ లైటింగ్ ఇన్ 64 కలర్స్, వైడ్ స్క్రీన్ కాక్ పిట్, నప్పా లెదర్ అండ్ బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంటాయి.

9-స్పీడ్ ఆటోమేటెడ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో వస్తున్న మెర్సిడెజ్-బెంజ్ జీ-క్లాస్ జీ400డీ కారు ఓఎం656 ఇంజిన్, 3.0-లీటర్ల సిక్స్ సిలిండర్ టర్బో డీజిల్ మోటర్ కలిగి ఉంటుంది. ఇది 330 బీహెచ్పీ విద్యుత్, 700 ఎన్ఎం టార్చి వెలువరిస్తున్నది. మెర్సిడెస్-ఏఎంటీ ఫార్ములా వన్ టీంలో నానోస్లైడ్ సిలిండర్ బ్యారెల్స్ వినియోగిస్తారు.

ఈ ఎస్యూవీ ఎకో ఫ్రెండ్లీగా డిజైన్ చేశారు. కోకోనట్ ఫైబర్ విత్ లాటర్ ఎమల్షన్ బైండింగ్ ఏజెంట్, కంపోజిట్ మెటీరియల్ విత్ రీప్రాసెస్డ్ వుడ్ ఫైబర్, 35.9కిలోల హై క్వాలిటీ రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో రూపుదిద్దుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

