Jeep Meridian X Special | భారత్ మార్కెట్లోకి జీప్ మెరిడియన్ ఎక్స్ స్పెషల్ ఆవిష్కరణ.. ధరెంతంటే..?!
Jeep Meridian X Special | ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా భారత్ మార్కెట్లో బుధవారం తన మెరిడియన్ ఎక్స్ స్పెషల్ ఎడిషన్ (Jeep Meridian X Special Edition) కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Jeep Meridian X Special | ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా భారత్ మార్కెట్లో బుధవారం తన మెరిడియన్ ఎక్స్ స్పెషల్ ఎడిషన్ (Jeep Meridian X Special Edition) కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. మూడు వరుసల ఎస్యూవీ కారులో కొత్తగా స్పెషల్ స్టైలింగ్ అప్‌గ్రేడ్స్, యాక్సెసరీస్ జత చేసింది. దీని ధర రూ.34.27 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. మెరిడియన్ లిమిలెడ్ ఓ, మెరిడియన్ ఓవర్ లాండ్ వేరియంట్ల మధ్యలో నిలుస్తుందీ జీప్ మెరిడియన్ ఎక్స్ స్పెషల్ ఎడిషన్. లిమిటెడ్ సంఖ్యలో వస్తున్న ఈ కార్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
2024 జీప్ మెరిడియన్ ఎక్స్ స్పెషల్ ఎడిషన్ కారుకు ప్రీమియం లుక్ అందించే గ్రే ప్యాకెట్లు, కాంట్రాస్ట్ గ్రే రూఫ్, అల్లాయ్ వీల్స్ న్యూ బాడీ కలర్డ్ లోవర్స్ జత చేశారు. స్టైలింగ్ అప్ గ్రేడ్స్తోపాటు కొత్త ఫీచర్లతో క్యాబిన్ అభివృద్ధి చేశారు. న్యూ సైడ్ మౌల్డింగ్, పడిల్ ల్యాంప్స్, ప్రోగ్రామబుల్ అంబియెంట్ లైటింగ్, సన్ షేడ్స్, ఎయిర్ ఫ్యూరిఫయర్, డాష్ కామ్ వంటి ఫీచర్లు జత కలిశాయి. ప్రీమియం కార్పేట్ మ్యాట్స్, ఆప్షనల్ రేర్ సీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ కూడా ఉంటుంది.
జీప్ మెరిడియన్ ఎక్స్ స్పెషల్ ఎడిషన్ కారు 2.0 లీటర్ల డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 168 బీహెచ్పీ విద్యుత్, 350 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. గరిష్టంగా గంటకు 198 కి.మీ దూరం ప్రయాణించే ఈ కారు కేవలం 10.8 సెకన్లలో 100 కి.మీ వేగంతో దూసుకెళ్లగలుగుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

