న్యూఢిల్లీ : కవాసకి ఇండియా భారత్‌లో 2022 కవాసకి నింజ 1000ఎస్ఎక్స్ను లాంఛ్ చేసింది. ఎమరాల్డ్ బ్లేజ్డ్ గ్రీన్, మెటాలిక్ మ్యాటీ గ్రాఫీన్ స్టీల్ గ్రే రంగుల్లో ఆకర్షణీయ ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ఈ బైక్ ధర రూ 11,40,000 (ఎక్స్‌షోరూం, ఇండియా)కు అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. రిలాక్స్డ్ పొజిషన్స్‌లో స్పోర్ట్స్, టూరింగ్ రైడ్స్‌కు అనుకూలంగా ఈ బైక్‌ను డిజైన్ చేశారు.
2022 కవాసకి నింజ 1000ఎస్ఎక్స్ మోటార్, కంఫర్ట్ ఫీచర్స్‌కు మెరుగులు దిద్దారు. స్పోర్ట్, రోడ్, రెయిన్ రైడింగ్ మోడ్స్‌తో ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్ వంటి పలు మార్పులు చేపట్టారు. 6-స్పీడ్ గేర్‌బాక్స్, కవాసకి క్విక్ షిఫ్టర్ వంటి స్పెసిఫికేషన్స్ జోడించారు.