న్యూఢిల్లీ, జూన్ 16: కాంప్యాక్ట్ హ్యాచ్‌బ్యాక్ వెన్యూలో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది హ్యాందాయ్ మోటర్. ప్రారంభ ధర రూ.7.53 లక్షలుగా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఎస్యూవీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సరికొత్త మోడల్‌ను విడుదల చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మారుతి సుజుకీ బ్రెజ్జా, టాటా మోటర్స్ నెక్సాన్, కియా సోనెట్‌లకు పోటీగా సంస్థ ఈ మోడల్‌ను ప్రవేశపెట్టింది. 1జ2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన మోడల్ రూ.7.53 లక్షల ప్రారంభ ధరతో లభించనుండగా, 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగిన మోడల్ ధర రూ.9.99 లక్షలుగా నిర్ణయించింది. అలాగే రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో డీజిల్ మోడల్ లభ్యమవనున్నది. పాత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త మోడల్లో 40 మార్పులు చేసినట్లు, ముఖ్యంగా డిజైనింగ్, ఇతర వాటిల్లో మార్పులు చేసింది. వాహన పనితీరును అలెక్సా, గూగుల్ వాయిస్‌తో తెలుసుకునే విధంగా ఈ కారును రూపొందించింది. ఇప్పటికే ఈ కారు కోసం 15 వేల బుకింగ్‌లు రాగా, పాత మోడల్‌కు 25 వేల పెండింగ్‌లో ఉన్నాయి.