Audi Q5 Facelift | దేశీయ విపణిలోకి ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్.. ధరెంతో తెలుసా?!
Audi Q5 Facelift | దేశీయ విపణిలోకి ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ మోడల్ కారును ఆవిష్కరించింది. ఈ కారు రూ.58.93 లక్షల నుంచి లభిస్తుంది.

Audi Q5 Facelift | జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తాజాగా విపణిలోకి మరో మోడల్ కారును తీసుకొచ్చింది. ఐదు సీట్ల ఎస్యూవీ క్యూ5లో ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఆడి ఎస్యూవీ క్యూ5 ఫేస్‌లిఫ్ట్ వర్షన్.. టెక్నాలజీ, ప్రీమియం ప్లస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు రూ.58.93-63.77 లక్షల మధ్య వినియోగదారులకు లభిస్తుంది. ఈ ఏడాదిలోనే దేశీయ విపణిలో ఆడి విడుదల చేసిన కార్లలో ఇది తొమ్మిదవది.
ఆడి ఎస్యూవీ క్యూ5 ఫేస్‌లిఫ్ట్ వర్షన్ కారును ఔరంగాబాద్‌లోని స్కోడా ఆటో ఫోక్స్ వ్యాగన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో తయారు చేశారు. దీని ఇంజిన్ సామర్థ్యం 2.0 లీటర్లు. విస్తృత ఇన్ఫోటైన్మెంట్ ఆప్షన్లు, అసిస్టెంట్ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. పార్కింగ్ అసిస్టెన్స్, కంఫర్ట్ కీ, వర్చువల్ కాక్‌పిట్ ప్లస్, 19 స్పీకర్ బీ అండ్ ఓ ప్రీమియం, 3డీ సౌండ్ సిస్టం తదితర మోడ్రన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు, ఎంఎంఐ టచ్, ఎంఎంఐ నావిగేషన్ ప్లస్, ఆడి స్మార్ట్‌ఫోన్ ఇంటర్ఫేస్, ఆడి ఫోన్ బాక్స్ విత్ వైర్లెస్ చార్జింగ్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ క్లాస్, బీఎండబ్ల్యూ ఎక్స్3, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ కార్లతో ఇది పోటీ పడనుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- audi
- q5 face lift
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

