2000 Notes | ముంబై, ఆగస్టు 1: రద్దు చేసిన రూ.2 వేల నోట్లలో 88 శాతం తిరిగి బ్యాంకులకు చేరాయని ఆర్బీఐ తెలిపింది. దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న రూ.3.56 లక్షల కోట్ల రూ.2 వేల నోట్లలో రూ.3.14 లక్షల కోట్లు డిపాజిట్ అయ్యాయని మంగళవారం వెల్లడించింది. ఇంకా చలామణిలో రూ.42 వేల కోట్లు ఉన్నట్లు పేర్కొంది.