Cars Sales | పుంజుకున్న కార్ల సేల్స్.. మారుతీ హ్యుండాయ్ ఆన్ టాప్!
Cars Sales | కార్లతోపాటు అన్నికేటగిరి వెహికిల్ సేల్స్ పెరిగాయి. కార్లలో మారుతి, హ్యుండాయ్, టూ వీలర్స్‌లో హీరో మోటో కార్ప్స్ మార్కెట్ వాటా పెంచుకున్నాయి.
Cars Sales | గత నెలలో కార్లు, టూ వీలర్స్ సేల్స్‌లో గణనీయ వృద్ధి నమోదైంది. 2022 ఫిబ్రవరితో పోలిస్తే 15.95 శాతం కార్లు, టూ వీలర్స్ సేల్స్ పెరిగాయి. కొవిడ్-19కి ముందు 2020-ఫిబ్రవరితో పోలిస్తే 11 శాతం గ్రోత్ రికార్డయింది. గతేడాది ఫిబ్రవరిలో 15,31,196 కార్లు, టూ వీలర్స్ అమ్ముడైతే, గత నెలలో 17,75,424 యూనిట్లు సేల్ అయ్యాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (Federation of Automobile Dealers Association – FADA) తెలిపింది. కొత్త మోడల్ కార్ల ఆవిష్కరణలు, పెండ్లిండ్ల సీజన్ నేపథ్యంలో కార్ల విక్రయాలు పెరిగాయని పేర్కొంది.
గత నెల కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి ఇండియా, హ్యుండాయ్ మోటార్ ఇండియా మొదటి స్థానంలో నిలిచాయి. మారుతి సుజుకి 1.18 లక్షల కార్లు విక్రయించగా, మొత్తం కార్ల సేల్స్‌లో అది 41.40 శాతం. గతేడాది ఫిబ్రవరిలో 1.09 లక్షల కార్లు విక్రయించింది మారుతి. మరోవైపు హ్యూండాయ్ మోటార్స్ 2022 ఫిబ్రవరిలో 38,688 యూనిట్లు విక్రయిస్తే గత నెలలో 39,106 కార్లు అమ్ముడు పోయాయి. టాటా మోటార్స్ 38,965, మహీంద్రా అండ్ మహీంద్రా 29,356 యూనిట్లు విక్రయించాయి.
`గతనెలలో వాహనాల సేల్స్ డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేశాయి. 2020 ఫిబ్రవరి నాటి ప్రీ-కొవిడ్ నాటి సేల్స్‌తో పోలిస్తే ఎనిమిది శాతం తక్కువ. టూ వీలర్స్, త్రీ వీలర్స్, కార్లు, ట్రాక్టర్లు, వాణిజ్య వాహనాల సేల్స్‌లో డబుల్ డిజిట్ గ్రోత్ రికార్డయింది. టూ వీలర్స్ 15 శాతం, త్రీ వీలర్స్ 81, కార్లు 11, ట్రాక్టర్లు 14, కమర్షియల్ వెహికల్స్ 17 శాతం సేల్స్ జరిగాయి` అని ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు.
గతేడాది ఫిబ్రవరిలో 11,04,309 టూ వీలర్స్ అమ్ముడుపోగా, గత నెలలో 15శాతానికి పైగా సేల్స్ నమోదయ్యాయి. గత ఫిబ్రవరిలో 12,67,233 యూనిట్ల టూ వీలర్స్ అమ్ముడయ్యాయి. వీటిల్లో హీరోమోటో కార్ప్ సంస్థ 3,90,673 బైక్స్, స్కూటర్లు విక్రయించింది. కమర్షియల్ వెహికల్స్ సేల్స్ 17 శాతం పెరిగి 67,391 నుంచి 79,027 యూనిట్లకు చేరాయి. కానీ, ప్రీ-కొవిడ్ సేల్స్‌తో పోలిస్తే 10 శాతం తక్కువే. త్రీ వీలర్స్ సేల్స్ 40,224 యూనిట్ల నుంచి 72,994 యూనిట్లకు పెరిగాయి. ట్రాక్టర్ల విక్రయాలు 14 శాతం వృద్ధితో 68,988 యూనిట్లకు చేరుకున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

