న్యూఢిల్లీ, ఆగస్టు 25: అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ ఈజెనిసిస్లో 14 మిలియన్ డాలర్లు (రూ. 130 కోట్లకు పైనే) పెట్టుబడులు పెట్టబోతున్నట్టు నాట్కో ఫార్మా ప్రకటించింది. దీంట్లోభాగంగా నాట్కో ఫార్మా కెనడా యూనిట్లో 9.5 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్న సంస్థ..నాట్కో దక్షిణాఫ్రికా యూనిట్లో 4.5 మిలియన్ డాలర్ల నిధులు చొప్పించనున్నది.