న్యూఢిల్లీ, జనవరి 3: ఇటలీకి చెందిన సూపర్ బైకుల తయారీ సంస్థ డుకాటీ..ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లోకి 11 కొత్త మోడళ్ళను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. వీటిలో స్క్రాంబ్లర్ 800 అర్బన్ మోటర్డ్, స్ట్రీట్‌ఫైటర్ వీ2, మల్టీస్ట్రేడా వీ2, మల్టీస్ట్రేడా వీ4 పీక్స్ పీక్, స్ట్రీట్‌ఫైటర్ వీ4 ఎస్పీ, ఎంవై22 పనిగల్ వీ4, ఎక్స్ మోడళ్ళు ఉన్నాయి. గతేడాది 15 కొత్త బైకులను విడుదల చేయాలనుకున్నప్పటికీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వెనక్కి తగ్గినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.