1,000 కోట్ల పెట్టుబడులు.. ప్రకటించిన ఫ్రెష్‌టుహోమ్
- ప్రకటించిన ఫ్రెష్‌టుహోమ్..
- రాబోయే ఐదేండ్లలో దశలవారీగా వ్యాపార విస్తరణ
బెంగళూరు/హైదరాబాద్, జూన్ 23: ఆన్లైన్లో మాంసం విక్రయాలు జరిపే ఫ్రెష్‌టుహోమ్ (ఎఫ్టీహెచ్).. తెలంగాణలో రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. రాబోయే ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా చేయబోయే వ్యాపార విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నది.
తాజా మాంసం, చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తులకు ప్రపంచంలోనే అతిపెద్ద పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ ఈ-కామర్స్ వేదికగా ఎఫ్టీహెచ్ పేరుగాంచిన విషయం తెలిసిందే. రాష్ట్ర జనాభాలో 98 శాతానికిపైగా మంది మాంసాహార ప్రియులే. నెలకు 1.4 కిలోల తలసరి వినియోగం ఉన్నది. ఈ క్రమంలోనే తెలంగాణలో వ్యాపార కార్యకలాపాల్ని మరింతగా పెంచాలని ఫ్రెష్‌టుహోమ్ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది.
స్థానిక ఫారాల్లో నుంచే..
రాష్ట్రంలో వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తున్న ఫ్రెష్‌టుహోమ్.. చేపలు, మాంసాన్ని స్థానిక ఫారాల్లో నుంచే సేకరించనున్నది. ఇది రైతులకు లాభించగలదని సంస్థ చెప్తున్నది. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ-ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలూ పేర్కొంటున్నాయి. మత్స్యకారుల నుంచి తాజా చేపల్ని కస్టమర్లకు చేర్చేలా తగిన మౌలిక సదుపాయాల్నీ బలోపేతం చేస్తున్నట్టు ఈ సందర్భంగా సంస్థ వివరించింది. 24-36 గంటల్లోగా ఏ చోటికైనా డెలివరీలు చేస్తామని, రసాయనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించబోమని తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నియమాలను పాటిస్తామని పేర్కొన్నది.
చిన్న నగరాల్లోనూ..
తెలంగాణ, ఏపీల్లో ప్రస్తుతం 50కిపైగా నగరాల్లో ఫ్రెష్‌టుహోమ్ వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు వరంగల్, ఖమ్మం వంటి 19 జిల్లాల్లో సేవలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మున్ముందు మరిన్ని నగరాల్లో.. ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ ఫ్రెష్‌టుహోమ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చేలా సంస్థ చర్యలు తీసుకోనున్నది. కాగా, 2015లో ప్రారంభమైన ఈ సంస్థకు టీయూవీ, ఇతర ప్రముఖ ఏజెన్సీల నుంచీ గుర్తింపున్నది.
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. పెట్టుబడులకు అనువైన చోటు. ఇక్కడ మా సంస్థ మార్కెటింగ్‌కూ విస్తృత అవకాశాలున్నాయి. నిజానికి దక్షిణ భారతంలో మాంసం వినియోగదారులు ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నారు. అందుకే ఐదేండ్ల దశలవారీ పెట్టుబడుల ప్రణాళికతో వచ్చాం. ఇకపై వ్యాపార భాగస్వాములు, పంపిణీదారులను మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టనున్నాం. వినియోగదారులకు సరసమైన ధరకే నాణ్యమైన మాంసాన్ని అందించడమే మా లక్ష్యం.
-షాన్ కడవిల్, ఫ్రెష్‌టుహోమ్ సహవ్యవస్థాపకులు
- ప్రస్తుతం తెలంగాణలోని 19 జిల్లాల్లో 18 చోట్ల అందుబాటులో ఫ్రెష్‌టుహోమ్ సేవలు
- హైదరాబాద్‌లో గత 6 నెలల్లో 6 రెట్ల వ్యాపార వృద్ధిని చూసిన సంస్థ
- వ్యాపార విస్తరణకు దోహదపడుతున్న పెరిగే కస్టమర్లు, ఆఫ్‌లైన్ స్టోర్లకు వస్తున్న ప్రజాదరణ
- దేశవ్యాప్తంగా 2,800లకుపైగా ప్రాంతాల్లో నెలకు 25 లక్షలకుపైగా ఆర్డర్ల డెలివరీ
- రెండు తెలుగు రాష్ర్టాలుసహా కర్నాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, పశ్చిమబెంగాల్ తదితర ప్రధాన భారతీయ మార్కెట్లలో వ్యాపార కార్యకలాపాలు
- భారత్‌తోపాటు యూఏఈలోనూ ఫ్రెష్‌టుహోమ్ వ్యాపారాలు
- బహిరంగ మార్కెట్ ధరకే ఎటువంటి రసాయనాలు వినియోగించని 100% తాజా మాంసం అమ్మకాలు
- ఫ్రెష్‌టుహోమ్ వెబ్సైట్ లేదా సంస్థ మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులకు 2వేలకుపైగా రకాల మాంసపు ఉత్పత్తులను ఆర్డర్ చేసుకునే సౌకర్యం
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- 000 crore
- 1
- FTH
- investments
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

