Beauty Tips | చర్మాన్ని తేమగా ఉంచుకోవడం చలికాలంలో అతిపెద్ద సవాలు. రకరకాల క్రీములు వాడుతుంటాం. చలి పులి నుంచి చర్మాన్ని రక్షించుకోడానికి ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన సరికొత్త బ్యూటీ ట్రెండ్.. కొరియన్ ఎమల్షన్. ఇది మాయిశ్చరైజర్ కంటే తేలికైంది. చర్మాన్ని తేమగా ఉంచి.. బయటి వాతావరణంలోని బ్యాక్టీరియా, కాలుష్యం నుంచి రక్షణ కల్పిస్తుంది.
ముఖం కడుక్కుని సీరమ్ రాసుకున్న తర్వాత ఈ ఎమల్షన్ను ఉపయోగించాలి. ఇది మాయిశ్చరైజర్ కంటే వేగంగా చర్మంలో ఇంకిపోతుంది. అంతేకాదు, అన్ని రకాల చర్మాల వారికీ నప్పుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అందుకే, సౌందర్య-ఆరోగ్య ప్రియులంతా కొరియన్ ఎమర్షన్ వైపు చూస్తున్నారు