విటమిన్ – బ్యూటీ!
చర్మం నిగారింపుతో మెరిసిపోవాలని అందరికీ ఉంటుంది. ఆ మక్కువకొద్దీ మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు వాడతారు. కానీ, సౌందర్యాన్ని కోరుకునేవారంతా ముందుగా చేయాల్సిన పని..
చర్మం నిగారింపుతో మెరిసిపోవాలని అందరికీ ఉంటుంది. ఆ మక్కువకొద్దీ మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు వాడతారు. కానీ, సౌందర్యాన్ని కోరుకునేవారంతా ముందుగా చేయాల్సిన పని..చర్మానికి అవసరమయ్యే విటమిన్లు ఏమిటన్నది తెలుసుకోవడం. ఆయా విటమిన్లు పుష్కలంగా ఉన్న ఉత్పత్తులనే ఉపయోగించాలి.
మొటిమలు
శరీరంపై మొటిమలు రాకుండా విటమిన్-ఎ ఉపకరిస్తుంది. ముఖ చర్మంపై శరీరం విడుదల చేసే నూనెలను ఇది నియంత్రిస్తుంది. జిడ్డు చర్మం ఉన్న వాళ్లకు విటమిన్-ఎ చాలా మేలు చేస్తుంది.
విటమిన్-ఎ లభించే క్రీములు వాడుతూ పాల పదార్థాలు, చేపలు, ముదురు రంగు పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి.
ముడతలు
రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి విటమిన్-సి నిండుగా ఉన్న పండ్లు, కూరగాయలు తినాలని నిపుణులు చెబుతారు. అందువల్ల 3-10 శాతం విటమిన్-సి ఉన్న క్రీములు పూస్తే చర్మంపై ముడతలు తగ్గుతాయి. ముందునుంచే వాడుతూ ఉంటే.. అసలు రాకుండా జాగ్రత్తపడవచ్చు. ఎండవల్ల కలిగే సమస్యలకూ విటమిన్-సి అడ్డుకట్ట వేస్తుంది. విటమిన్-సి జోడించిన మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లోషన్ హానికరమైన అతినీల లోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి.
పొడి చర్మం
చర్మం పొడిబారడం, గరుకుగా ఉండటం, పెచ్చులు ఊడటం.. మొదలైన సమస్యలు ఉన్నప్పుడు విటమిన్-ఇ చక్కని పరిష్కారం. విటమిన్-ఇ లభించే సన్‌స్క్రీన్ లోషన్లు, మాయిశ్చరైజర్లను వాడితే చర్మం పొడిబారదు.
దురద-తామర
చర్మ సమస్యలైన తామర, సోరియాసిస్‌తో బాధపడేవారికి విటమిన్-డి ఉన్న పైపూతలు ఉపశమనం కలిగిస్తాయి. క్రమం తప్పకుండా వాడితే మంట, దురద తగ్గిపోతాయి.
నల్లటి వలయాలు
కళ్ల చుట్టూ నల్లటి వలయాలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. అలాంటివాళ్లు విటమిన్-కె ఉన్న ఐ క్రీములు వాడితే సమస్య దూరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

