Skin Care | ఇలా చేస్తే చలి నుంచి చర్మాన్ని రక్షించుకోవచ్చు!
చలికాలం చర్మానికి గడ్డుకాలమే. వాతావరణంలో తేమశాతం తగ్గిపోవడంతో రకరకాల సమస్యలు వస్తాయి. అయితే, కొన్ని అపోహల వల్ల చాలామంది చర్మ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. వాటిని దూరం చేసుకుంటే చలికాలాన్ని గట్టెక్కినట్టే.
Skin Care | చలికాలం చర్మానికి గడ్డుకాలమే. వాతావరణంలో తేమశాతం తగ్గిపోవడంతో రకరకాల సమస్యలు వస్తాయి. అయితే, కొన్ని అపోహల వల్ల చాలామంది చర్మ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. వాటిని దూరం చేసుకుంటే చలికాలాన్ని గట్టెక్కినట్టే.
ఈ కాలంలో సన్‌స్క్రీన్ లోషన్ అవసరం లేదు.
పొరపాటు! అతినీలలోహిత కిరణాలు ఏడాది పొడవునా మన చర్మం మీద ప్రభావం చూపిస్తాయి. ఈ సీజన్లో ఆ తీవ్రత మరింత ఎక్కువ. కాబట్టి సున్నితమైన చర్మం ఉన్నవారు, బయటికి వెళ్లే టప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం తప్పనిసరి!
మన చర్మానికి వేడి నీటి స్నానం ఎంతో మేలు చేస్తుంది.
తప్పు! వేడివేడి నీళ్లు చర్మం మీదున్న ఆ కాస్త తేమనూ హరిస్తాయి. కాబట్టి చలి కాలంలో, మరీ ముఖ్యంగా పొడిబారిపోయే చర్మం ఉన్నవారు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచిది. ఆపై మాయిశ్చరైజర్ రాయడం వల్ల తేమ నిలిచి ఉంటుంది.
తగినన్ని నీళ్లు తాగితే చర్మం పొడిబారదు.
కాదు! శీతకాలంలో దాహం వేయక పోయినా, తగినన్ని నీళ్లు తాగడం మంచిదే. కానీ నేరుగా చర్మాన్ని తాకే పొడిగాలులు, హీటర్ల నుంచి వచ్చే వేడి.. చర్మాన్ని పొడిబారుస్తాయి. ఈ సమయంలో మంచి మాయిశ్చరైజర్ చాలా అవసరం.
పెట్రోలియం జెల్లీని మించిన మాయిశ్చరైజర్ లేదు.
ప్చ్! చవకగా, తేలికగా దొరికే పెట్రోలియం జెల్లీ వల్ల ఉపయోగం లేకపోలేదు. అది చర్మంలోని తేమ ఆవిరై పోకుండా అడ్డుకుంటుంది. అంతకుమించి చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండేందుకు.. అదనంగా తేమ దక్కేందుకు షియా బటర్ లాంటి పదార్థాలతో కూడిన మాయిశ్చరైజర్ వాడాలి.
పెదాలు పగిలినప్పుడే లిప్ బామ్ వాడాలి.
లేదు! చలి ఎక్కువగా ఉన్న సమయం నుంచే లిప్ బామ్ రాయడం మొదలుపెడితే, పెదాలు పగిలేంత సమస్య రానేరాదు. అప్పుడే అధరాలు.. పొడిగాలులను తట్టుకుని మృదువుగా, కాంతివంతంగా ఉంటాయి.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

