Beauty Tips | ముఖం ముద్దుగా ఉంటే సరిపోతుందా.. పాదాల అందాన్ని కూడా పట్టించుకోండి..!
Beauty Tips | ముఖంపై, ఒంటిపై శ్రద్ధ చూపించేవాళ్లు పాదాల సంరక్షణను మాత్రం గాలికి వదిలేస్తారు. పాదాల సంరక్షణ ఎలాగో తెలియక కొందరు వదిలేస్తే, ఆ... పాదాలు ఎలా ఉంటే ఏందిలే అని మరికొందరు లైట్ తీసుకుంటారు. కానీ కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా పాదాలను అందంగా చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం..
Beauty Tips : నలుగురిలో అందంగా కనిపించడం కోసం చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ముఖానికి, ఒంటికి క్రీములు, లోషన్లు రుద్దుతుంటారు. హెయిర్ కటింగ్‌లో, వస్త్రధారణలో సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. కండ్లకు ఐ లైనర్లు, పెదాలకు లిప్‌స్టిక్‌లు అంటూ వేటికీ వెనక్కి తగ్గరు. ముఖంపై, ఒంటిపై ఇంత శ్రద్ధ చూపించేవాళ్లు పాదాల సంరక్షణను మాత్రం గాలికి వదిలేస్తారు. పాదాల సంరక్షణ ఎలాగో తెలియక కొందరు వదిలేస్తే, ఆ… పాదాలు ఎలా ఉంటే ఏందిలే అని మరికొందరు లైట్ తీసుకుంటారు. కానీ కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా పాదాలను అందంగా చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం..
చిట్కాలు..
1. నోటి శుభ్రత కోసం ఉపయోగించే మౌత్‌వాష్ పౌడర్ చర్మానికి తేమను అందిస్తుంది. ఒక వెడల్పాటి బకెట్లో కొంచెం మౌత్‌వాష్ పౌడర్, నీళ్లు కలిపి అందులో 15 నిమిషాలు కాళ్లు పెట్టాలి. తర్వాత వేరే నీళ్లతో పాదాలను శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పాదాలు తేమగా మారి మడిమల్లో పగుళ్లు తగ్గిపోతాయి.
2. అదేవిధంగా యాంటీ మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న తేనె చక్కని మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. మడిమల పగుళ్లకు కొద్దిగా తేనె రాసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
3. కొబ్బరి నూనె కూడా పొడి చర్మానికి తేమను అందించి తాజాగా మారుస్తుంది. రోజూ రాత్రిపూట నిద్రపోయే ముందు పాదాలకు, మడిమలకు కొబ్బరి నూనె రాసుకుంటే పగుళ్ల బాధ తగ్గుతుంది.
4. సాధారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా పాదాలు పగుళ్లుబారుతాయి. అప్పుడు వెనిగర్ కలిపిన నీటిలో పాదాలను కొద్దిసేపు ఉంచితే పగుళ్లు తగ్గిపోతాయి.
5. పగిలిన పాదాలకు ఓట్మీల్, పాల మిశ్రమం కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది. ప్రతివారం ఈ మిశ్రమాన్ని పాదాలకు, మడిమలకు రాసుకుంటే పగుళ్లు మాయమవుతాయి.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

