Beauty Tips | తరచూ నెయ్యితో మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా..?
Beauty Tips | తలకు నెయ్యి (Ghee) రాసుకుంటే జుట్టు (Hair) బాగా పెరుగుతుందని సాధారణంగా చాలామంది అంటుంటారు. ఆయుర్వేదం (Ayurvedam) కూడా నెయ్యి వినియోగంవల్ల ప్రయోజనం ఉంటుందని చెబుతున్నది. అయినా కూడా ఇది ఎంతవరకు నిజం..? నెయ్యితో మర్దన చేయడంవల్ల కేశాలు దట్టంగా, నల్లగా పెరుగుతాయా..? నిజంగా ప్రయోజనం ఉంటుందా..? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి.
Beauty Tips : తలకు నెయ్యి (Ghee) రాసుకుంటే జుట్టు (Hair) బాగా పెరుగుతుందని సాధారణంగా చాలామంది అంటుంటారు. ఆయుర్వేదం (Ayurvedam) కూడా నెయ్యి వినియోగంవల్ల ప్రయోజనం ఉంటుందని చెబుతున్నది. అయినా కూడా ఇది ఎంతవరకు నిజం..? నెయ్యితో మర్దన చేయడంవల్ల కేశాలు దట్టంగా, నల్లగా పెరుగుతాయా..? నిజంగా ప్రయోజనం ఉంటుందా..? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. మరి దీనిపై నిపుణులు (Experts) ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..!
పోషకాల గని
ఎన్నో రకాల పోషకాలకు నెయ్యి నిలయం. నెయ్యిని ఆహారంగా తీసుకోవడంవల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. నెయ్యిలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు నెయ్యిలో ఒమేగా–3, ఒమేగా–9 ఫ్యాటీ యాసిడ్స్ గణనీయంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి తోడ్పడతాయి.
కేశాలకు మేలు ఎలా..?
నెయ్యితో తలపై మర్దన చేసినప్పుడు అందులోని ఒమేగా–3, ఒమేగా–9 ఫ్యాటీ యాసిడ్లు వెంట్రుకల కుదుళ్లకు మంచి పోషకాలను అందిస్తాయి. కేశాలు బాగా పెరిగేందుకు వీలైన పరిస్థితిని కల్పిస్తాయి. నెయ్యిలో అత్యధికంగా ఉండే విటమిన్-ఏ వల్ల వెంట్రుకల కుదుళ్లు బలోపేతం అవుతాయి. కుదుళ్లు పొడిబారిపోకుండా, దెబ్బతిన్న కణాలు పునరుద్ధరణ చెందేందుకు విటమిన్-ఏ తోడ్పడుతుంది. నెయ్యిలో విటమిన్-ఈ కూడా అధికంగా ఉంటుంది. ఇది అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. వెంట్రుకలు రాలిపోకుండా తోడ్పడుతుంది. నెయ్యిలో ఉండే బ్యూటరేట్ ఫ్యాటీ యాసిడ్‌కు శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించే సామర్థ్యం ఉంటుంది. వెంట్రుకల కుదుళ్లు దెబ్బతినకుండా ఇది కాపాడుతుంది.
అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కేవలం నెయ్యితో మర్దన చేసినంత మాత్రాన రాత్రికి రాత్రే కేశాల పెరుగుదల మొదలవుతుందని భావించవద్దని నిపుణులు చెబుతున్నారు. వెంట్రుకలు, కుదుళ్లు పొడిబారకుండా ఆరోగ్యంగా ఉండేందుకు నెయ్యిలోని పోషకాలు తోడ్పడుతాయని అంటున్నారు. దానివల్ల వెంట్రుకలు తెగిపోకుండా బలంగా మారుతాయని చెబుతున్నారు. వెంట్రుకలు రాలిపోవడానికి ఇతర కారణాలైన తీవ్ర ఒత్తిడి, అపరిశుభ్రత, ఇతర అనారోగ్యాలు, హార్మోన్ల అసమతుల్యత వంటి వాటి నుంచి కూడా బయటపడటంపై దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
నెయ్యితో మర్దన ఎలా..?
నెయ్యిని కాస్త వేడిచేయాలి. అది ఎక్కువ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్న సమయంలో కుదుళ్లకు పట్టేలా మర్దన చేయాలి. ఇలా తరచూ చేయడంవల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
Beauty Tips | తరచూ నెయ్యితో మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా..?
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

