Payyavula Keshav | ఇండియా కూటమితో పొత్తు కోసమే ఢిల్లీకి జగన్.. ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు
Payyavula Keshav | వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేయడాన్ని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ సెటైర్లు వేశారు. ఏపీలో శాంతి భద్రతలు లేవంటూ ఢిల్లీ రోడ్లపై గగ్గోలు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో జగన్‌ను ఎవరూ పట్టించుకోలేదని, జాతీయ మీడియాతో మాట్లాడటం తప్ప ఒక్కడ ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
Payyavula Keshav | వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేయడాన్ని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ సెటైర్లు వేశారు. ఏపీలో శాంతి భద్రతలు లేవంటూ ఢిల్లీ రోడ్లపై గగ్గోలు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో జగన్‌ను ఎవరూ పట్టించుకోలేదని, జాతీయ మీడియాతో మాట్లాడటం తప్ప ఒక్కడ ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
ఇండియా కూటమితో పొత్తు కోసమే వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లినట్లు ఉందని మంత్రి పయ్యావుల కేశ్ అన్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ఇండియా కూటమితో పొత్తుపెట్టుకునేందుకు జగన్ వెంపర్లాడుతున్నారని ఆరోపించారు. రెడ్‌బుక్ అంటూ ఢిల్లీలో హడావుడి చేయడం కాదని.. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయని.. శాసనసభకు వచ్చి మాట్లాడాలని సూచించారు.
ధర్నా చేయడానికి ఢిల్లీ వెళ్లిన జగన్ అమరావతికి వచ్చాడని.. ఇక అసెంబ్లీ సమావేశాలకు వస్తే బాగుంటుందని పయ్యావుల కేశవ్ సూచించారు. రాజకీయ హత్యలకు సంబంధించి ఢిల్లీ వేదికగా చెప్పిన వివరాలను అసెంబ్లీకి వచ్చి చెప్పాలని అన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
కాగా, ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగన్‌పై హోంమంత్రి వంగలపూడి అనిత కూడా సీరియస్ అయ్యారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు రాజకీయ హత్యలు జరిగాయని.. అందులో ముగ్గురు టీడీపీకి చెందినవారే ఉన్నారని వంగలపూడి అనిత స్పష్టం చేశారు. వాటికి సంబంధించి కేసు నంబర్లతో సహా వెల్లడించామని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 36 రాజకీయ హత్యలు జరిగాయని వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారని.. ఆ పేర్లు అడిగితే మాత్రం మాట్లాడటం లేదని విమర్శించారు. అసెంబ్లీకి వచ్చి ఆ 36 మంది పేర్లు చెప్పే దమ్ము జగన్‌కు లేదా అని ప్రశ్నించారు. చనిపోయిన వాళ్ల పేర్లు చెప్పకుండా ఢిల్లీ ఎందుకు వెళ్లారని ఆమె నిలదీశారు.
జగన్ ఆరోపిస్తున్నట్లు టీడీపీ దాడుల్లో చనిపోయిన 36 మంది వివరాలతో సభకు రావాలని హోంమంత్రి వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ఆ వివరాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఆ వివరాలు తప్పు అని తేలితే ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. నారా లోకేశ్ రెడ్‌బుక్ గురించి వైసీపీ కార్యకర్తలే పట్టించుకోవడం లేదని.. మరి జగన్‌కు ఎందుకు నిద్ర పట్టడం లేదో అని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

