YS Jagan | స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
YS Jagan | ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడుతున్న సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫైర్ అయ్యారు.
YS Jagan | ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడుతున్న సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫైర్ అయ్యారు.పైతాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి చంద్రబాబు కుట్రలకు తెరలేపాడని ఆరోపించారు. ఎన్నికల్లో చంద్రబాబు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలువాని కుట్రలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వంపై అన్ని ఆధారాలను ఎస్ఈసీ, గవర్నర్‌కు సమర్పించామన్నారు.
సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లామని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఈ నెల 25 వరకు అభ్యర్థుల తుది జాబితా వాయిదా వేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. మా నామినేషన్లను అడ్డుకుంటున్నారంటే అర్థమేంటి?. వ్యవస్థ దిగజారిపోయిందని అర్థమవుతోందన్నారు. కూటమి ప్రభుత్వానికి నిజంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామనే ధైర్యం ఉంటే వైసీపీ అభ్యుర్థుల నామినేషన్లు ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేశారన్న నమ్మకం మీకుంటే నామినేషన్లను అడ్డుకోకుండా పోటీలో నిలబడాలని సవాల్ విసిరారు.
నామినేషన్ వేసే అభ్యర్థులకు రక్షణ కల్పించడంతో పాటు బందోబస్తు, సీసీ టీవీ రికార్డింగ్ చేయాలని ఆదేశించింది. సుప్రీం ఇంత స్పష్టంగా చెప్పినా చంద్రబాబులో మార్పు రాలేదన్నారు. చంద్రబాబు చేతిలో తోలుబొమ్మలా మారిన డీజీపీలో మార్పు వచ్చిందా?. డీఐజీలు, ఎస్పీలు, కలెక్టర్లలో మార్పు వచ్చిందా?. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలు అలాంటి వారికి బుద్ధి చెప్పాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

