బోరు బావిలో పడిపోయిన బాలుడు – ప్రాణాలకు తెగించి కాపాడిన యువకుడు
ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయిన ఓ బాలుడ్ని స్థానికులు రక్షించారు. స్థానిక యువకుడొకరు ప్రాణాలకు తెగించి చాకచక్యంగా వ్యవహరించి బాలుడ్ని కాపాడాడు.
ఏలూరు జిల్లా : ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయిన ఓ బాలుడ్ని స్థానికులు రక్షించారు. స్థానిక యువకుడొకరు ప్రాణాలకు తెగించి చాకచక్యంగా వ్యవహరించి బాలుడ్ని కాపాడాడు. బాలుడ్ని సురక్షితంగా బోరు బావి నుంచి కాపాడటంతో చొరవ చూపిన సురేష్ అనే యువకుడిని స్థానికులు, పోలీసులు అభినందించారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం గుండు గోలనుగుంటలో ఈ సంఘటన బుధవారం చోటుచేసుకున్నది.
గుండు గోలనుగుంటకు చెందిన పూర్ణ జశ్వంత్ బుధవారం సాయంత్రం ఇంటికి సమీపంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సమీపంలో ఉన్న 400 అడుగుల లోతు బోరుబావిలో పడిపోయాడు. మట్టి కూరుకుపోవడంతో 30 అడుగుల లోతులో ఉన్న బండరాయిపై ఇరుక్కుపోయాడు. తల్లిదండ్రులు కొడుకు జస్వంత్ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. చివరకు రాత్రి 9 గంటల ప్రాంతంలో బోరు బావిలో నుంచి జస్వంత్ కేకలు వేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు.
స్థానికులు వెంటనే తాళ్ల సహాయంతో బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నించారు. దాదాపు 5 గంటలకు పైగా జస్వంత్ బోరు బావిలో బిక్కుబిక్కుమంటూ గడిపాడు. నడుం భాగానికి తాడు కట్టుకుని బోరుబావిలోకి సురేష్ అనే యువకుడు దిగాడు. జస్వంత్‌ను పట్టుకోగానే స్థానికులు పైగి లాగారు. బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బోరు బావి ప్రమాదం నుంచి ప్రాణాలతో బాలుడు బయటపడటంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. బాలుడ్ని కాపాడటంలో ధైర్యం చేసి బోరుబావిలోకి దిగిన యువకుడు సురేష్‌ను గుండు గోలనుగుంట వాసులు అభినందించారు. సమాచారం అందుకున్న భీమడోలు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

