Vijayasai Reddy | ఆమెను కూతురుగానే భావించా.. శాంతితో రిలేషన్‌పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Vijayasai Reddy | ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రిలేషన్‌పై ఆమె భర్త మదన్ మోహన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెద్ద దుమారమే లేపాయి. ఈ వ్యవహారం సంచలనంగా మారడంతో ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ వార్తలపై సంజాయిషీ ఇచ్చారు.
Vijayasai Reddy | ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రిలేషన్‌పై ఆమె భర్త మదన్ మోహన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెద్ద దుమారమే లేపాయి. విజయసాయిరెడ్డి వల్లే తన భార్యకు కొడుకు పుట్టాడని మదన్ మోహన్ ఆరోపిస్తున్నాడు. ఇది నిరూపించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాడు. ఈ వ్యవహారం సంచలనంగా మారడంతో ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ వార్తలపై సంజాయిషీ ఇచ్చారు.
అవాస్తవాలు ప్రసారం చ్తేన్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చలామణీ అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని విజయసాయిరెడ్డి అన్నారు. అయితే ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. శాంతి కళింగిరిని 2020 సంవత్సరంలో ఏపీ ఎండోమెంట్స్ ఆఫీసర్‌గా వైజాగ్ సీతమ్మధార ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి చూశానని తెలిపారు. తొలిసారి ఆమెను కలిసినప్పటి నుంచి ఇప్పటివరకు కూతురిగానే భావించానని స్పష్టం చేశారు.
ఒక తండ్రిలా శాంతికి ఏ సహాయం కావాలన్నా చేశానని విజయసాయిరెడ్డి తెలిపారు. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి చూసొచ్చానని చెప్పారు. తాడేపల్లిలోని తన ఇంటికి తీసుకొచ్చి ఆశీర్వదించానని తెలిపారు. తనకు ఏ మహిళతోనూ అనైతిక/అక్రమ సంబంధాలు లేవని స్పష్టం చేశారు. తాను నమ్మిన దేవ దేవులు శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో కూడా ఇదే చెబుతానని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

