Kethireddy Peddareddy | తాడిపత్రి ఏమైనా వాళ్ల జాగీరా? జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై కేతిరెడ్డి కౌంటర్
Kethireddy Peddareddy | అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బెయిల్ షూరిటీలు సమర్పించేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శనివారం ఉదయం తాడిపత్రిలో అడుగుపెట్టారు. కేతిరెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల నడుమ ఇవాళ ఆయన తాడిపత్రిలోకి అడుగుపెట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Kethireddy Peddareddy | అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బెయిల్ షూరిటీలు సమర్పించేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శనివారం ఉదయం తాడిపత్రిలో అడుగుపెట్టారు. కేతిరెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల నడుమ ఇవాళ ఆయన తాడిపత్రిలోకి అడుగుపెట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాడిపత్రికి వచ్చిన కేతిరెడ్డి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. బెయిల్ మంజూరై ఐదు రోజులు గడిచినా షూరిటీలు ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, మరో 10 మందిపై ఆంక్షలు ఉన్నప్పటికీ తాడిపత్రిలో విచ్చలవిడిగా సంచరిస్తున్నారని, అయినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీర్ కాదని కేతిరెడ్డి అన్నారు. తనను, తన కొడుకులను అనంతపురం జిల్లా నుంచి బహిష్కరించడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. జిల్లా నుంచి తనను ఎవరూ బహిష్కరించలేరని స్పష్టం చేశారు. తన ఊపిరి ఉన్నంతవరకూ తాడిపత్రిలోనే ఉంటానని తెలిపారు. తాడిపత్రి ప్రజలకు అండగా ఉంటానని అన్నారు.
తనను అంతం చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. తాడిపత్రిలో మళ్లీ అలజడి సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటానని తెలిపారు.
కాగా, కేతిరెడ్డిని తాడిపత్రి, అనంతపురం నుంచి కాదు.. మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచే బహిష్కరించాలని నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులను కూడా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతానని హెచ్చరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

