AP Budget | దమ్ముంటే బడ్జెట్‌పై ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను నిలదీసిన వైసీపీ
AP Budget | ఏపీ సీఎం చంద్రబాబు మార్క్ వంచనకు నిలువెత్తు సాక్ష్యమే ఈ బడ్జెట్ అని వైసీపీ విమర్శించింది. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారంటూ టీడీపీ పచ్చి అబద్ధాలు చెబుతోందని మండిపడింది. ఇది ప్రజలు మెచ్చే బడ్జెట్ కాదు.. ఇది వంచన బడ్జెట్ అని ఎద్దేవా చేసింది.
AP Budget | ఏపీ సీఎం చంద్రబాబు మార్క్ వంచనకు నిలువెత్తు సాక్ష్యమే ఈ బడ్జెట్ అని వైసీపీ విమర్శించింది. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారంటూ టీడీపీ పచ్చి అబద్ధాలు చెబుతోందని మండిపడింది. ఇది ప్రజలు మెచ్చే బడ్జెట్ కాదు.. ఇది వంచన బడ్జెట్ అని ఎద్దేవా చేసింది. సూపర్ సిక్స్ హామీలకు నిధులు కేటాయింపులు లేవని.. ఆద్యంతం అబద్ధాలు.. అవాస్తవాలు.. వక్రీకరణల సమాహారంగా ఈ బడ్జెట్ మిగిలిపోయిందని పేర్కొంది.
ఎంతో గొప్ప బడ్జెట్ అని చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నామని.. దమ్ముంటే వాటికి సమాధానాలు చెప్పాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2024-25పై పలు ప్రశ్నలను సంధించింది.
2024–25 వార్షిక బడ్జెట్ రూ.2,94,427 కోట్లు కాగా, గత ఏడాది సవరించిన అంచనాల మేరకు బడ్జెట్ రూ.2,53,500 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి రూ.41 వేల కోట్ల పెరుగుదల ఎలా సాధ్యం?
అందులోనూ ఒక్క దీపం పథకంలో ఒక సిలిండర్ మినహా, సూపర్ సిక్స్ సహా సంక్షేమ పథకాలకు కేటాయింపులు చూపలేదు. అంటే సంక్షేమం లేకున్నా, రూ.41 వేల కోట్లు ఎక్కువ చూపిస్తున్నారు. ఇక అమరావతి పనుల కోసం చూపిన రూ.15 వేల కోట్లు.. గ్రాంటా? లేక అప్పా? అనేది ప్రశ్నార్థకమే
తొలి ఆరు నెలల్లో రాబడి రూ.41,500 కోట్లు అయితే, మిగిలిన ఆరు నెలల్లో రూ.78 వేల కోట్ల ఆదాయం ఎలా సాధ్యం?
యువగళం కింద యువతకు ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ పథకానికి బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదు?
తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్ధికి ఏటా రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. బడ్జెట్లో స్పష్టమైన కేటాయింపులు ఎందుకు లేవు?
వాస్తవానికి తల్లికి వందనంలో 83 లక్షల మంది పిల్లలకు రూ.12,450 కోట్లు కావాలి. అలాంటప్పుడు ఇప్పుడు కేటాయించిన మొత్తం ఎంత మందికి సరిపోతుంది?
అన్నదాత సుఖీభవ పథకానికి బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయింపు కనిపిస్తోంది. వ్యవసాయ మంత్రి చెప్పిన ప్రకారం ఆ పథకానికి రూ.4,500 కోట్లు కేటాయించారు. మిగతా రూ.3500 కోట్లు పీఎం కిసాన్ నుంచి వచ్చేది. నిజానికి ఈ పథకంలో అర్హులైన రైతులు 53.53 లక్షల మందికి ఇవ్వాలంటే రూ.10,706 కోట్లు కావాలి. మరి రూ.1000 కోట్లు ఎలా సరిపోతుంది?
దీపం పథకానికి రూ.895 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంతో కేవలం 95 లక్షల కుటుంబాలకే ఇవ్వడం వీలవుతుంది. రాష్ట్రంలో 1.42 కోట్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. ఈ లెక్కన మిగతా వారందరికీ ఇవ్వరా?
ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రూ.37,300 కోట్లు కావాలి. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున 2,07,30,000 మందికి ఇవ్వాలి. దీని ఊసే లేదు.
రాష్ట్ర బడ్జెట్లో మహిళలకు ఉచిత బస్సు ప్రస్తావనే ఎందుకు లేదు.
2014 ఎన్నికల్లో కూడా వ్యవసాయ రుణాల మాఫీ, సున్నా వడ్డీ రుణాలు, ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా రుణాల మాఫీ, కాపులు, చేనేతలకు సాయం, నిరుద్యోగ భృతి.. ఇలా అన్ని హామీలు నెరవేర్చకుండా ఎందుకు మోసం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

