Srisailam Project | శ్రీశైలం10 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల
Srisailam Project | జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు కు ఎగువభాగాన కురుస్తున్న వర్షాల వల్ల అధికారులు జలాశయం నుంచి 10 గేట్ల ద్వారా 2,71,570 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నంద్యాల : జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు ( Srisailam Project ) కు ఎగువభాగాన కురుస్తున్న వర్షాల వల్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు జలాశయం నుంచి 10 గేట్ల ద్వారా 2,71,570 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు ( Nagarjuna sagar ) విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు 2.84 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 3.09 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 883 అడుగుల వరకు నీరు నిలువు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు 204.78 టీఎంసీలు నిలువ ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడు అవకాశముందని వాతావరణశాఖ అధికారులు వివరించారు. తీరం వెంబడి 40-60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

