శ్రీశైలం ప్రాజెక్టు 6 గేట్ల ద్వారా నీటి విడుదల
AP Projects | శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు కొనసాగుతోంది. అధికారులు 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
అమరావతి : శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు కొనసాగుతోంది. అధికారులు 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ జలాశయానికి 2,80,348 క్యూసెక్కుల నీరు వస్తుండగా 2,27,325 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉండగా ప్రస్తుతం 884.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకుగాను ప్రస్తుతం 215.3263 టీఎంసీలుగా ఉంది.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఆరు క్రెస్ట్ గేట్ల ద్వారా 60,453 క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 42,213 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సోమశిల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 77.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 69.1 టీఎంసీలుగా ఉంది. కర్నూల్ జిల్లా సుంకేశుల ప్రాజెక్ట్ 13 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సుంకేశుల ఇన్‌ఫ్లో 54,087 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 52,832 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

