ఏపీ స్థానిక ఎన్నికల నామినేషన్లలో ఉద్రిక్తత
ఏపీలో స్థానిక సంస్థల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ల మొదటి రోజే వైసీపీ, తెలుగుదేశం శ్రేణుల మధ్య దాడులు చోటుచేసుకున్నాయి. అన్నమయ్య జిల్లా పుంగనూరు నామినేషన్ కేంద్రానికి వైసీపీ అభ్యర్థుల తరపున నామినేషన్లు దాఖలు చేసేందుకు వైసీపీ లోక్‌సభ పక్షనేత, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, నేతలు అక్కడికి వెళ్లారు.
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఏపీలో స్థానిక సంస్థల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ల మొదటి రోజే వైసీపీ, తెలుగుదేశం శ్రేణుల మధ్య దాడులు చోటుచేసుకున్నాయి. అన్నమయ్య జిల్లా పుంగనూరు నామినేషన్ కేంద్రానికి వైసీపీ అభ్యర్థుల తరపున నామినేషన్లు దాఖలు చేసేందుకు వైసీపీ లోక్‌సభ పక్షనేత, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, నేతలు అక్కడికి వెళ్లారు. మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడిచేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ఎస్‌ఎన్‌కాలనీలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి కార్యాలయంపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. వైసీపీ కార్యాలయం, అక్కడ ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు.
ఈ ఘటనలో 15 కార్లు ధ్వంసమవ్వగా, నాలుగు వాహనాలు కాలిపోయాయి. గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆఫీస్ లోపలే ఉన్నారు. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. తిరుపతిలో మేయర్ ఎన్నికల నామినేషన్ల కేంద్రాల వద్ద ఘర్షణ చోటుచేసుకున్నది. కొర్లగుంట, బైరాగిపట్టెడ ప్రాంతాల్లో వైసీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ వద్ద స్వల్ప ఘర్షణ వాతావరణం కనిపించింది. ఈ క్రమంలో పరిస్థితి తీవ్రతను గుర్తించిన రాష్ట్ర ఐజీ జిల్లాల ఎస్పీలతో అత్యవసర సమీక్ష నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘర్షణలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదికలు కోరింది.
ఘటనలపై మిథున్‌రెడ్డికి జగన్ ఫోన్
దాడి ఘటనకు సంబంధించి వైపీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్న ఉద్దేశం సీఎం చంద్రబాబుకు లేదని జగన్ ఆరోపించారు. రెండున్నరేండ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, అందుకే అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎంపీ కే భద్రత లేదంటే పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. దాడులు జరుగుతున్నా పోలీసులు మౌనంగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొంటామని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

