తిరుమల: సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ మరికాసేపట్లో విడుదల చేయనుంది. గురువారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. బుధవారం ఈనెల 12, 13, 14 తేదీలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేసిన విషయం తెలిసిందే.