TTD | శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్
TTD | తిరుమల(Tirumala) శ్రీవారిని శనివారం ఏపీ గవర్నర్(Ap Governor ) ఎస్. అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
తిరుమల : తిరుమల(Tirumala) శ్రీవారిని శనివారం ఏపీ గవర్నర్(Ap Governor ) ఎస్. అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టీటీడీ ఈవో(Ttd EO) ఎవి.ధర్మారెడ్డి స్వాగతం పలకగా, ఆలయ అర్చకులు ఇస్తి కఫల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు.
అనంతరం ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. అంతకుముందు గవర్నర్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ వరాహస్వామి(Varaha Swamy)వారిని దర్శించుకున్నారు. గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, సీవీఎస్వో నరసింహకిషోర్, డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవో బాలిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రెండు కంపార్ట్మెంట్ల(Compartments) లో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 59,071 మంది భక్తులు దర్శించుకోగా 27,651 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.12 కోట్లు వచ్చిందని వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

