స్వరూపానందేంద్ర స్వామిని కలిసిన టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి

హైదరాబాద్ : విశాఖ శ్రీశారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర స్వామిని తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహర్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీకి సంబంధించిన పలు విషయాలను స్వామివారితో ఆయన చర్చించారు. పలు కీలక అంశాలను జవహర్ రెడ్డి స్వామివారి దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా టీటీడీ తరఫున నిర్వహించబోతున్న కళ్యాణమస్తు కార్యక్రమం మారుమూల ప్రాంతానికి చెందిన భక్తులకు సైతం చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని స్వరూపానంద స్వామి సూచించారు. టీటీడీ తరఫున గిరిజన గ్రామాల్లో నిర్మించ తలపెట్టిన ఆలయాలను త్వరగా పూర్తి చేయాలని ఈఓకు చెప్పారు. స్వరూపానంద స్వామి సూచనలపై ఈఓ జవహర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలో వాటికి సంబంధించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

