Tirupati | ఘనంగా తిరుపతి పట్టణం ఆవిర్భావ వేడుకలు ప్రారంభం
Tirupati | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించేలా తిరుపతి(Tirupati) 894వ ఆవిర్భావ వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
తిరుపతి : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించేలా తిరుపతి (Tirupati) 894వ ఆవిర్భావ వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీటీడీ (TTD) ఆధ్వర్యంలో చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Karunakar Reddy) తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జగద్గురువు రామానుజాచార్యులు తిరుపతిని 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24న శంకుస్థాపన చేసి గోవిందరాజపురంగా నామకరణ చేశారని అనంతరం నేడు తిరుపతిగా భాసిల్లుతున్నదన్నారు.

ఇక నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న సాంప్రదాయంగా, ఆచారంగా తిరుపతి పుట్టిన రోజు వేడుకను టీటీడీ క్యాలెండర్ లో భాగం చేస్తామని వెల్లడించారు. తిరుపతి నగరం ప్రపంచానికి ఓ ఆదర్శ నగరం కావాలని ఆకాంక్షించారు. టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుపతి మీదుగా తిరుమలకు చేరుకుంటారని తెలిపారు. భక్తులకు మరింత ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించేందుకు తిరుపతి నగరాన్ని కూడా తిరుమల తరహాలో సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.

అలరించిన ఆధ్యాత్మిక శోభా యాత్ర
తిరుపతి ఆవిర్భావ వేడుకల సందర్భంగా చైర్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శోభాయాత్రను ప్రారంభించారు. టీటీడీ డీపీపీ, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టుకు చెందిన వందలాది మంది కళాకారులు చెక్క భజనలు, కోలాటాలతో ఆడుతూ, గోవింద నామ సంకీర్తనలు, వేదపండితులు మంత్రోచ్చారణల మధ్య శోభాయాత్రను నిర్వహించారు. కళాకారుల వివిధ దేవతామూర్తుల, పౌరాణిక వేషధారణలు విశేషంగా ఆకర్షించాయి.

Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

