Chandra Babu | బెయిల్‌పై విడుదలైన తర్వాత చంద్రబాబు ఏం మాట్లాడారంటే..
Chandra Babu | స్కిల్ డెవలప్ మెంట్ స్కీం కుంభకోణం కేసులో మధ్యంతర బెయిల్ పై జైలు నుంచి విడుదలైన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. తన 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఏ తప్పూ చేయలేదన్నారు.
Chandra Babu | ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీం కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు 53 రోజులకు మంగళవారం ఏపీ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తల సందోహం మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తన 45 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఏ తప్పూ చేయలేదని పేర్కొన్నారు.
ఇప్పటి వరకూ తన రాజకీయ చరిత్రలో ఏ తప్పు చేయలేదు. చేయను. చేయనివ్వను. భవిష్యత్ లోనూ చేయబోనని చంద్రబాబు స్పస్టం చేశారు. `నేను కష్టంలో ఉన్నప్పుడు రోడ్డు మీదకు వచ్చి సంఘీభావం తెలిపారు. మీరందరూ 52 రోజులుగా నాకు మద్దతు తెలిపారు. ఏపీలో, తెలంగాణలో, విదేశాల్లో మద్దతు తెలిపారు. నాకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నేను చేసిన పనులతో లబ్ధి పొందిన వారంతా వచ్చి సంఘీభావం తెలిపారు. పవన్ కల్యాణ్ ఓపెన్‌గా బయటకు వచ్చి మద్దతు తెలిపారు. నాకు మద్దతు తెలిపిన పవన్ కల్యణ్ కు ధన్యవాదాలు. హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతుగా నిలిచారు.మీరు చూపించిన అభిమానం జీవితంలో మరిచిపోను` అని చంద్రబాబు పేర్కొన్నారు.
`నాకోసం మీరు పూజలు, ప్రార్థనలు చేశారు. మీరు చూపించిన అభిమానం నేను నా జీవితంలో మరిచిపోను సీపీఐ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సంఘీభావం తెలిపారు. వారందరికీ ధన్యవాదాలు` అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలకు అభివాదం తెలుపుతూ కారెక్కారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

