Chandra Babu | ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: ఏ1 నిందితుడిగా చంద్రబాబు.. మాజీ మంత్రులు నారాయణ, నారా లోకేష్ పేర్లు కూడా.. !
Chandra Babu | ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ప్రథమ నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ చార్జిషీట్ దాఖలు చేసింది.
Chandra Babu | త్వరలో జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ గట్టి షాక్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబునాయుడిని ప్రథమ నిందితుడిగా చేరుస్తూ ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. రెండో ముద్దాయిగా మాజీ మంత్రి నారాయణతోపాటు నారా లోకేశ్, లింగమనేని రాజశేఖర్, లింగమనేని రమేష్ లను కూడా నిందితులుగా చేర్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డుపై సింగపూర్ ప్రభుత్వంతో గత చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నదని సీఐడీ తన చార్జిషీట్లో స్పష్టం చేసింది.
గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందం అనే పేరిట అందరినీ చంద్రబాబు ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని ఏపీ సీఐడీ తన చార్జిషీట్లో వెల్లడించింది. ప్రభుత్వం 2 ప్రభుత్వం ఒప్పందమేమీ జరుగలేదని నిర్ధారించింది. అసలు సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించలేదని స్పష్టం చేసింది. మాస్టర్ ప్లాన్ పేరిట చట్ట విరుద్ధంగా సుర్బానా జురాంగ్ సంస్థకు డబ్బు చెల్లించారని నిర్ధారణకు వచ్చింది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్డు, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్లు రూపొందించారని తన చార్జిషీట్ లో వివరించింది. లింగమనేని బ్రదర్స్ భూములు, హెరిటేజ్ భూములు, నారాయణ భూములకు అనుగుణంగా ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ మార్చారని తెలిపింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో మాజీ మంత్రి నారాయణ తన బంధువుల పేరిట 58 ఎకరాలు కొనుగోలు చేశారు. లింగమనేని 340 ఎకరాల ల్యాండ్ బ్యాంకుకు మేలు చేసే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు చేర్పులు చేశారు. లింగమనేని తన ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారని సీఐడీ వివరించింది. లింగమనేని ల్యాండ్ బ్యాంకు పక్కనే హెరిటేజ్ ఫుడ్స్ 14 ఎకరాల భూమి కొనుగోలు చేసిందని తెలిపింది. ఈ భూముల విలువ పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చేశారని నిర్ధారించినట్లు సీఐడీ తెలిపింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

