Yash | టీడీపీ ఎన్నారై కార్యకర్త యశ్ అరెస్ట్.. జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్న టీడీపీ కార్యకర్తలు
Yash | టీడీపీ ఎన్నారై కార్యకర్త బొద్దులూరి యశస్వి(యశ్)ని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు ఇండియాకు వచ్చిన ఆయన్ను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
Yash | టీడీపీ ఎన్నారై కార్యకర్త బొద్దులూరి యశస్వి(యశ్)ని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు ఇండియాకు వచ్చిన ఆయన్ను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. సోషల్‌మీడియా వేదికగా వైకాపా ప్రభుత్వం, ఏపీ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకుగానూ యశ్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం సీఆర్పీసీలోని 41ఏ సెక్షన్ కింద నోటిసులిచ్చి వదిలిపెట్టారు. జనవరి 11వ తేదీన విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వచ్చి.. విచారణకు సహకరించాలని సూచించారు.
యష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. భార్యాపిల్లలతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. టీడీపీ అభిమాని అయిన యశ్.. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తరచూ పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలోనే ఆయన్ను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
కాగా, యశ్ అరెస్టు ఏపీలో సంచలనం రేపింది. యశ్ అరెస్టును ఖండిస్తూ టీడీపీ నాయకులు వరుసగా ప్రకటనలు చేశారు. నీ సైకో చేష్టలు మరొక్క వంద రోజులే జగన్ రెడ్డి.. అట్టుకి, అట్టున్నర తిరిగి ఇచ్చేస్తామని టీడీపీ ట్వీట్ (ఎక్స్) చేసింది. జగన్ అరాచకాలను ప్రశ్నిస్తే దేశద్రోహమా అని ప్రశ్నించారు. క్రూరమైన ప్రభుత్వం అరెస్టులు, నిర్బంధాలతో ప్రశ్నించే గొంతును వైసీపీ ప్రభుత్వం అణిచివేయాలని చూస్తోందని నారా లోకేశ్ మండిపడ్డారు. ఒక టెర్రరిస్టులా అతన్ని అరెస్టు చేయడం దారుణమని అన్నారు. యశ్‌కు న్యాయం జరిగే వరకు విశ్రమించేది లేదని.. వైఎస్సార్సీపీకి రోజులు దగ్గరపడ్డాయని విమర్శించారు. #WeStandWithYash అంటూ ట్యాగ్ పెట్టారు. యశ్ అరెస్టు అప్రజాస్వామికమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్బంధాలతో ప్రజల గొంతు నొక్కే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
Shocked to learn about the illegal arrest of NRI Yash Bodduluri at Hyderabad airport yesterday night on the basis of false cases filed against him in Andhra Pradesh. This draconian govt wants to stifle voices that question with arrests and detentions. I have learned that he was… pic.twitter.com/zrFCGlvM06
— Lokesh Nara (@naralokesh) December 23, 2023
NRI యాష్ బద్దులూరి. ఏపీ సీఐడీ నోటీసులు….రెండు కేసుల్లో సీఆర్పీసీ 41ఏ కింద ఏపీ సీఐడీ నోటీసులు. జనవరి 11న విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ నోటీసులు….. #WeStandWithYash pic.twitter.com/wdLmp3ubZj
— vanusblog (@vanusblog) December 23, 2023
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

