టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలి : మంత్రి కొడాలి
kodali nani|ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వ్యవహారాలకు వ్యతిరేకంగా
అమరావతి : ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వ్యవహారాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు సూచించారు. నాడు ఎన్టీఆర్ మద్యపాన నిషేదం విధిస్తే చంద్రబాబు బెల్టు షాపులు తెరిచారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బెల్టు షాపులను రద్దు చేసిందని గుర్తు చేశారు. మద్యపానం రేట్లు పెంచితే తగ్గించాలని టీడీపీ నిరసనలు చేసిందని విమర్శించారు. సహజ మరణాలను కల్తీసారాకు లింకు పెడుతున్నారని దుయ్యబట్టారు.
ఈ రోజు సమావేశం మొదలవగానే టీడీపీ ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న వరుస మరణాలపై చర్చించాలని పట్టు బట్టారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి తమకు చర్చకు అనుమతించాలని నినాదాలు చేశారు. టీడీపీ పక్షనేత అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ సభ్యులు తమ వద్ద ఉన్న కాగితాలను చింపివేసి స్పీకర్‌పై పడవేశారు. దీంతో సమావేశాన్ని కొంతసేపు వాయిదా వేసిన స్పీకర్ అనంతరం సమావేశాన్ని ప్రారంభించారు. సరైన ఫార్మాట్లో వస్తే చర్చకు సిద్ధమని ప్రభుత్వం తరుఫున స్పీకర్ పేర్కొనగా ఈరోజే చర్చించాలని పట్టుబట్టారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

