పోలీసుస్టేషన్లో నిందితుడు మృతి.. సీఐతో పాటు మరో ముగ్గురు సస్పెన్షన్
ఏపీలోని అనంతపురం జిల్లాలోని పోలీసుస్టేషన్ లో నిందితుడు ఒకరు అనుమానాస్పదస్థితిలో మరణించడంపై జిల్లా ఎస్పీ ఫకీరప్ప సీఐతో పాటు
అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లా పోలీసుస్టేషన్ లో నిందితుడు ఒకరు అనుమానాస్పదస్థితిలో మరణించడంపై జిల్లా ఎస్పీ ఫకీరప్ప సీఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును సస్పెన్షన్ చేశారు. జిల్లాలోని రాయదర్గం పైతోటలో గొర్రెల చోరీకి యత్నించిన ఇద్దరిని స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుల్లో ఒకరైన ఆత్మకూరు మండలం సనప వాసి ఆంజనేయులు రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు.
నిందితుడి మరణంపై పోలీసు ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం అందించకుండా గుట్టుగా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ మంగళవారం స్టేషన్‌ను సందర్శించి అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారెక్‌లో ఉండాల్సిన నిందితులను కంప్యూటర్ గదిలో ఉందుకు ఉంచారని మండిపడ్డారు.
ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని సీఐ శ్రీనివాసులుతో పాటు కానిస్టేబుళ్లు మధుబాబు, గంగన్నను సస్పెన్షన్, హోంగార్డు రమేశ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఘటనపై అనంతపురం ఇన్చార్జి డీఎస్పీ మహబూబ్ బాషాను పూర్తిస్థాయి విచారణాధికారిగా నియమించారు. ఎన్హెచ్ఆరీసీ నిబంధనల మేరకు వైద్యుల బృందంతో పోస్టుమార్టం నిర్వహిస్తామని ఎస్పీ వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

