YS Viveka Murder Case | కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి బెయిల్‌పై స్టే: సుప్రీంకోర్టు
Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది.
YS Viveka Murder Case | మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై అవినాశ్, సునీత తరఫు న్యాయవాదనలను ధర్మాసనం నిశితంగా విన్న తర్వాత కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను తప్పుబడుతూ ముందస్తు బెయిల్‌ను నిలిపేసింది. విచారణకు లిఖిత పూర్వక ప్రశ్నలు ఇవ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన రక్షణ తొలగిపోయింది.
జూన్ 30 వరకు విచారణ గడువు పొడిగింపు
వివేకా హత్యకేసు విచారణ గడువును జూన్ 30 లోపు ముగించాలని సీబీఐని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంతకుముందు ఏప్రిల్ 30 లోపు విచారణ పూర్తి చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక హైకోర్టు బెయిల్‌పై తేల్చే వరకు తన క్లయింట్‌ను అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలని అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు అంగీకరించలేదు.
అవినాశ్ రెడ్డిని సీబీఐ ఆరెస్ట్ చేస్తుందని మీరెందుకు ఉహించుకుంటున్నారు? అని ఎంపీ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. సీబీఐ అరెస్ట్ చేయదలచుకుంటే ఎప్పుడో చేసుండేది కదా? అని ఒకింత కోర్టు మండిపడింది. ఈ కేసులో సీబీఐ పూర్తి సంయమనంతో ఉందని తెలిపింది. మందస్తు బెయిల్ సంగతి తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అవినాష్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పుడు సంప్రదాయానికి దారితీసేలా ఉన్నాయని.. దర్యాప్తును కూడా ప్రభావితం చేసేలా ఉన్నాయన్న సీజేఐ ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అవినాష్‌ను అరెస్ట్ చేయడానికి సీబీఐకి లైన్‌క్లియర్ అయినట్టేనని సర్వత్రా చర్చ జరుగుతున్నది.
సీబీఐకి వివేకా హత్య కేసు వివరాలు సమర్పించిన ఎస్పీ
వివేకానంద రెడ్డి హత్య కేసు వివరాలను నాడు కడప ఎస్పీగా ఉన్న రాహుల్ దేవ్ శర్మ.. సీబీఐ అధికారులకు అందజేశారు. సోమవారం హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి వచ్చిన రాహుల్ దేవ్ శర్మ దాదాపు గంట సేపు అక్కడే ఉన్నారు. ఈ కేసుపై సీబీఐ అధికారులు పలు అంశాలు అడిగి తెలుసుకున్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తునకు గత ఏపీ సర్కార్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లోనూ రాహుల్ దేవ్ శర్మ సభ్యుడు. దీంతో గతంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన్ను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. హత్యాస్థలంలో లభించిన ఆధారాలను నాటి ఎస్పీగా రాహుల్‌దేవ్ శర్మకు వివేకా కుటుంబ సభ్యులు అందించారు. వాటి గురించి కూడా సీబీఐ అధికారులు ఆరా తీశారని సమాచారం.
భాస్కర్‌రెడ్డికి 29 వరకు జ్యుడిషియల్ రిమాండ్
వివేకా హత్య కేసులో అరెస్టైన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి సీబీఐ కస్టడీ సోమవారంతో ముగియడంతో వారిని అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ..వైఎస్ భాస్కర్‌రెడ్డికి ఈనెల 29 వరకు, ఉదయ్‌కుమార్‌రెడ్డికి ఈనెల 26 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల అనంతరం తిరిగి వారిద్దరినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

