రేపటి నుంచి శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పు
శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పు | రేపటి నుంచి శ్రీశైల ఆలయ దర్శనం వేళల్లో మార్పు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు.

శ్రీశైలం : రేపటి నుంచి శ్రీశైల ఆలయ దర్శనం వేళల్లో మార్పు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. కరోనా నేపథ్యంలో గతంలో దర్శన సమయాన్ని కుదించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటలకు మాత్రమే అనుమతించారు. కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో అధికారులు దర్శన సమయాన్ని అదనంగా మరో రెండు గంటలు పెంచారు. తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతున్నది. ఈ క్రమంలో వసతుల కల్పనకు సైతం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. భక్తులకు కేవలం స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని ఆయన వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
Manthani | మంథనిలో అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

