అమరావతి : ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ (SIT) అధికారులు దూకుడు పెంచారు. లాకప్ డెత్ ఆరోపణల కేసులో సస్పెండ్ అయిన కృష్ణలంక మాజీ సీఐ ఎస్ఎస్వీవీ నాగరాజును(CI Nagaraju)సిట్ అధికారులు విజయవాడలోని సింగ్‌నగర్‌లో అరెస్ట్ చేశారు. సిట్ అధికారుల బృందం నాగరాజు ఇంటికి వెళ్లడంతో అనుచరులు భారీగా అక్కడకు చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
పోలీసులు వారిని చెదరగొట్టి నాగరాజను పోలీస్ గెస్ట్‌హౌస్‌కు తరలించారు. ఆయనపై అక్రమ నిర్బంధం, హత్యాయత్నం, ఇతర అభియోగాల కింద కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.