YCP Corporators | విజయవాడలో వైసీపీకి షాక్.. ముగ్గురు కార్పొరేటర్లు టీడీపీలోకి జంప్
YCP Corporators | రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జై కొట్టడం రాజకీయ నాయకులకు తంతుగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న, మొన్నటి వరకు ఐదేండ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ నేడు అధికారం కోల్పోవడంతో కూటమిలోకి వరుస కడుతున్నారు.
అమరావతి : రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జై కొట్టడం రాజకీయ నాయకులకు తంతుగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న, మొన్నటి వరకు ఐదేండ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ(YCP) నేడు అధికారం కోల్పోవడంతో కూటమిలోకి వరుస కడుతున్నారు. విశాఖలో సుమారు 15 మందికి పైగా వైసీపీ కార్పొరేటర్లు (YCP Corporators) టీడీపీ, జనసేన పార్టీలోకి మారిని సంగతి తెలిసిందే.
తాజాగా విజయవాడలోనూ వైసీపీ నాయకులు అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. గురువారం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (MP Kesineni Chinni) ఆధ్వర్యంలో ముగ్గురు కార్పొరేటర్లు మైలవరం రత్నకుమారి, మైలవరం లావణ్య, హర్షద్‌తో పాటు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు.
ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ విజయవాడ నగరం అభివృద్ధి కోసం అనేక మంది టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో విజయవాడలో విపక్షపార్టీలకు కార్యకర్తలు దొరకడం కష్టమని పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

